బాబుకు ముద్రగడ ఓ హార్దిక్ పటేల్ అవుతారా: పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు?
విజయవాడ: తునిలో నిర్వహించిన 'కాపు గర్జన' కాపులలో, విపక్షాలలో కొత్త ఉత్సాహం నింపుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు గర్జన నిర్వహించారు. కాపులను బీసీలలో చేర్చాలనే ప్రధాన డిమాండుతో ఈ సభను నిర్వహించారు.
ముద్రగడ నిర్వహించిన కాపు గర్జన సభ నేపథ్యంలో.. కొద్ది రోజుల 'పటేల్'లకు రిజర్వేషన్లు అంటూ తెరపైకి వచ్చిన హార్దిక్ పటేల్ అంశం చర్చకు వస్తోంది. హార్దిక్ పటేల్ పటేల్ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ సందర్భంలో హార్దిక్ మాట్లాడుతూ... చంద్రబాబు తమ వర్గానికి చెందినవారేనని, ఆయన మద్దతు కూడా తమకు ఉందని చెప్పారు.
హార్దిక్ పటేల్ చేపట్టిన పటేల్ ఉద్యమం గుజరాత్‌లో వేళ్లూనుకున్న బిజెపిని స్థానిక సంస్థల ఎన్నికలలో బాగా దెబ్బతీసింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బిజెపికి అక్కడ ఎదురు లేకుండా పోయింది.

గత సార్వత్రిక ఎన్నికలలోను బిజెపి గుజరాత్‌లోని 26కు 26 లోకసభ స్థానాలను గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత పటేల్ ఉద్యమం నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. బిజెపిని పటేల్ ఉద్యమం దెబ్బతీసింది.
గుజరాత్‌లో బిజెపికి పటేల్ వర్గీయులు మొదటి నుంచి అండగా ఉంటూ వచ్చారు. హార్దిక్ పటేల్ రిజర్వేషన్ల ఉద్యమం పుణ్యమా అని కమలం పార్టీ దెబ్బతింది. ఇప్పుడు ఏపీలోని అలాంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాపులు టిడిపి - బిజెపి కూటమికి ఓటేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది. ఏ కాపులు అయితే 2014 ఎన్నికల్లో టిడిపిని పీఠం ఎక్కించారో ఇప్పుడు అదే కాపులు తిరగబడుతున్నారని విపక్షాలు అంటున్నాయి.
కాపులు ఇప్పటికీ తమ వైపే ఉన్నారని టిడిపి నేతలు చెబుతున్నప్పటికీ.. కాపు ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. గుజరాత్‌లో బిజెపిని హార్దిక్ పటేల్ దెబ్బతీసినట్లుగా.. ఏపీలో ముద్రగడ టిడిపికి మరో హార్దిక్ కానున్నారా అనే చర్చ సాగుతోంది.
హార్దిక్ పటేల్ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు మద్దతు పలికాయి. అసలు హార్దిక్ ఉద్యమం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని, మోడీ సొంత రాష్ట్రంలో దెబ్బతీసేందుకు అతనిని తెరపైకి తీసుకు వచ్చిందనే వాదనలు ఉన్నాయి.
ముద్రగడ ఉద్యమానికి వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు బిజెపి నేతలు వ్యక్తిగతంగా మద్దతు పలుకుతుండటం గమనార్హం. ఇప్పుడు ముద్రగడ కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లి చంద్రబాబును ఇరుకున పెడతారా? 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఏం చేస్తుంది? తదితర అంశాలపై చర్చ మొదలయింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications