అత్యుత్సాహంలో...టిడిపి అసలు విషయం మరిచిపోతోందా?...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

ఎపిలో టిడిపి లీకు రాజకీయాలు చివరకి ఆ పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోడీ-చంద్రబాబు ఫోన్ వ్యవహారమే చూస్తే...ఎపిలో టిడిపి రాజకీయాల పోకడ తీరు తేటతెల్లం అవుతుంది. ఎలాగంటే...

స్పెషల్ స్టేటస్ హోదా సాధ్యం కాదన్న జైట్లీ ప్రకటనకు నిరసనగా కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందే ప్రధాని మోడీతో తాను మాట్లాడే ప్రయత్నం చేసినట్లు చంద్రబాబే చెప్పిన విషయమూ తెలిసిందే. ఆ తరువాత మంత్రుల రాజీనామా సంగతి ప్రకటించాక కూడా చంద్రబాబు మరోసారి ప్రధానిని సంప్రదించనున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోనే చంద్రబాబు ఫోన్ చేస్తే ప్రధాని మోడీ లిఫ్ట్ చేయలేదు. ఆ తరువాత మోడీనే ఫోన్ చేశారు. ఈ విషయాలన్నీ టిడిపి లీకులు, మీడియా కథనాల ద్వారా వెల్లడవుతున్నాయి.

  Purandeshwari Rises Her Voice బాబును దులిపేసిన పురంధేశ్వరి
  ఫోన్ల వ్యవహారం...ప్రతిదీ ఒక ప్రహసనంలా...

  ఫోన్ల వ్యవహారం...ప్రతిదీ ఒక ప్రహసనంలా...

  చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేసిన విషయమే తీసుకుంటే...కేంద్రం తీరుతో విసిగిపోయి తాడో పేడో తేల్చుకునే క్రమంలో చివరిసారిగా ప్రధాని మోడీతో మాట్లాడే ప్రయత్నం చేశామని కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చంద్రబాబు మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇక ఆ విషయమై ప్రధాని మోడా కావాలనే ఇలా చేస్తున్నారు...తెలుగు వారిని చీప్ గా చూస్తున్నారన్న చందంగా కొన్ని మీడియా సంస్థలు విపరీతంగా ఊదరగొట్టేశాయి. ఆ తరువాత కేంద్రం నుంచి టిడిపి మంత్రులు వైదొలగాలన్న నిర్ణయం ప్రకటన తరువాత చంద్రబాబు మరోసారి ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారట...ఆ ఫోన్ కి కూడా మోడీ స్పందించలేదని...చూసారా?...ఇదెంత దారుణమో అనే చందంలో టిడిపి మళ్లీ పతాక స్థాయిలో మోడీ కి ఆంధ్రా పట్ల...వివక్ష...చులకన...ఘోరం...తదిదర నిందాపూర్వక పడికట్టు పదాలతో మళ్లీ కథనాలు కుమ్మరించాయి...ఈ తరుణంలోనే ప్రధాని మోడీ నుంచి ఫోన్ వచ్చింది!....

   వెర్షన్ ఛేంజ్...సుద్దులు...హెచ్చరికలు...

  వెర్షన్ ఛేంజ్...సుద్దులు...హెచ్చరికలు...

  చంద్రబాబు తనకు ఫోన్ చేసిన సమయంలో ఏ కారణం చేతనైనా స్పందించని ప్రధాని మోడీ ఆ తరువాత తనంతట తానుగా చంద్రబాబుకు ఫోన్ చేశారు...ఇక అంతే!...ఆ ఫోన్ లో చంద్రబాబుతో ప్రధాని మోడీ పదినిమిషాలు మాట్లాడారట. మరి ఈ నేతలు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ...ఆ తరువాత టిడిపి నుంచి వచ్చిన లీకులు...ప్రకటనలు...మాత్రం నిజంగా ఒక ప్రహసనాన్నే తలపించాయి...ప్రజల సహనానికి పరీక్షగా మారాయి...ఎలాగంటే...ఫోన్ లిఫ్ట్ చెయ్యకుంటే తెలుగువాళ్లంటే లెక్కలేదు...వివక్ష...ఛీప్ గా చూస్తున్నారంటూ లీకులు...కధనాలతో హోరెతత్తించిన ఆ పార్టీ నేతలు, కొన్ని మీడియా సంస్థలే ఆ తరువాత మళ్లీ అందుకు ఫూర్తిగా భిన్నమైన కథనాలను మళ్లీ పాఠకులపై,వీక్షకులపై కుమ్మరించడమే విచిత్రం. తెలుగు వాళ్ల దెబ్బకు మోడీ భయపడిపోయాడని...చంద్రబాబు ప్రకటనలతో వణికి పోయాడని...దిగి వచ్చి బతిమిలాడుకుంటున్నాడని...బాబ్బాబు...అన్నాగానీ...చంద్రబాబు...ఛీ...ఫో అన్నాడని...ఈ చందంలో మళ్లీ ఆ లీకులతో హోరెత్తించడం మొదలు. దీంతో చూసేవారికి వెగటు పుట్టేవరకు పరిస్థితి వెళ్లి పోయింది. సాక్షాత్తూ సమాచార శఖా మంత్రి కూడా అదే విధంగా ప్రకటన చేయడం ఈ ప్రహసనానికి పరాకాష్ట.

  నేల విడిచి సాము...అసల విషయం మరిచి...

  నేల విడిచి సాము...అసల విషయం మరిచి...

  అయితే ఈ తంతులో టిడిపి అసలు విషయం మరిచి నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది. టిడిపి కేంద్రం చేస్తున్న అన్యాయం పట్ల తమ పోరాటం అంచెలంచెలలుగా చేస్తామని ప్రకటించింది. చివరగా అవిశ్వాసం పెట్టే విషయమని స్పష్టం చేసింది. ఈ దశలవారీ పోరాటంలో ఏ సందర్భంలోనైనా కేంద్రం దిగి వ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది. అదే తమ విధానమని తేల్చి చెప్పింది. ఆ పోరాట క్రమంలో భాగంగానే కేంద్ర మంత్రి వర్గం నుంచి టిడిపి మంత్రులు వైదొలగడమని చెప్పింది. మరి ఆ చర్యతో ప్రధాని మోడీ దిగి వచ్చి తాను చర్చించుకుందామని అంటే అందుకు చంద్రబాబు నో చెప్పడమేంటీ?..ఏ దశలోనైనా వాళ్లు దిగి రావడమే కదా కోరుకుంది...పోనీ ప్రధాని మోడీ మీదా...బిజెపి మీద నమ్మకం లేకుంటే పూర్తిగా వైదొలగాలి...అంతే కానీ అందులోనే ఉంటూ చర్చించేందుకు వెళ్లనంటే...అది ఏ విధంగా సమంజసం...అలా పిలిచేందుకే కదా...పోరాటం...చర్చలు జరిపితేనే కదా...నిర్ణయానికి వచ్చేది...చర్చకు ససేమిరా అంటే దానర్థం ఏమిటి?...

   దశలవారీ పోరాటం...ఎక్కడవరకు...ఎన్నికల దాకానా?...

  దశలవారీ పోరాటం...ఎక్కడవరకు...ఎన్నికల దాకానా?...

  ప్రధాని మోడీ ఫోన్ చేసి చర్చిద్దామంటే...ససేమిరా అన్నామనే విషయం గొప్పగా చెప్పుకోవడం ద్వారా ఏం సాధించదల్చుకున్నారు. అంటే టిడిపి లక్ష్యం ఏమిటి...నిజంగానే అన్ని తప్పులను బిజెపి మీద తోసేసే ప్రయత్నమా?...అందుకే ఇలా దశల వారీగా ఆ పార్టీని...ప్రధాని మోడీని...తప్పులన్నింటికీ బాధ్యులను చేస్తూ...ఎన్నికల నాటికి పూర్తిగా ఆ పార్టీనే ద్రోహిగా నిలబెట్టాలనేదే ప్లానా...ఇప్పటివరకు టిడిపి-బిజెపి కలిసి చేయాల్సిన తప్పులన్నీ చేసి...రాష్ట్రానికి ఏమీ చెయ్యకుండా...ఇద్దరూ ఉమ్మడిగా చేసిన తప్పును ఒక్కరిపై వేయాలనే తాపత్రయమా...అంటే ఇందులోనూ రాజకీయమా?...లేకుంటే...ఇప్పటికైనా రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరాలంటే...ప్రధాని మోడీ తలుచుకుంటే సాధ్యపడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే...మరలాంటి మోడీనే మాట్లాడదామంటే...నో అనడంలో ఆంతర్యం ఏమిటి?...కేవలం బిజెపిని దోషిగా నిలబెట్టాలనే లక్ష్యమా?...ప్రధాని మోడీ చర్చలకు పిలిచినా వెళ్లలేదని...వెళ్లి ఉంటే రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూరి ఉండేదన భావన ప్రజల్లో కలిగితే అందుకు టిడిపి తీవ్ర మూల్యమే చెల్లించాల్సవుంటుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In Andhra pradesh state, TDP leak politics has been evole to damage own party. PM Modi-CM Chandrababu phone calls issue creat this doubts.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి