Madugula: వైసీపీ హ్యాట్రిక్ ను టీడీపీ-జనసేన కూటమి అడ్డుకుంటుందా ?
ఏపీలోని అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లలో మాడుగుల కూడా ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాడుగుల ,చీడికాడ ,దేవరపల్లె, కె.కోటపాడు మండలాలు ఉన్నాయి. దాదాపు రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు. జనాభా పరంగా చూస్తే కొప్పుల వెలమ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. ఆ తర్వాత కాపులు, ఎస్సీలు, గవరలు కూడా ఉంటారు. రాజకీయంగా కొప్పుల వెలమల ఆధిపత్యం ఇక్కడ ఉంటుంది. కాపులకు వీరితోనే పోటీ ఉంటోంది.
టీడీపీ ఆవిర్భావానికి ముందు మాడుగులలో ఆరు ఎన్నికలు జరిగితే ఇందులో 1952 లో కృషీకార్ లోక్ పార్టీ, 1955లో ప్రజా సోషలిస్టు పార్టీ, 1962లో తెన్నేటి విశ్వనాధం ఇండిపెండెంట్ గా గెలిచారు . 1967, 1972 ఎన్నికలలో కాంగ్రెస్ గెలవగా, 1978 లో తిరిగి ఇండిపెండెంట్ గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 ఎన్నికలు జరిగితే ఆరుసార్లు (1983, 1985, 1989, 1994, 1999, 2009) టీడీపీ గెలిచింది. 2004లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత రెండుసార్లు (2014, 2019) వైసీపీ గెలిచింది.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ బూడి ముత్యాల నాయుడు గెలిచారు. గత ఎన్నికల్లో గెలిచాక ఆయన జగన్ రెండోసారి కేబినెట్ లో డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఈ రెండు సార్లు కూడా ఆయన మెజారిటీ కేవలం 3, 4 వేలే. దీన్ని బట్టి టీడీపీ నుంచి ఆయన ఎంత గట్టి పోటీ ఎదుర్కొంటున్నారో తెలుస్తోంది. ఈసారి టీడీపీ-జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు హ్యాట్రిక్ కోసం తీవ్రంగా శ్రమించక తప్పడం లేదు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications