గోరంట్ల మాధవ్ కు జగన్ ప్రమోషన్ ? అంబటి రాంబాబు తరహాలోనే-టీడీపీ సెటైర్లు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయానికి ఏదీ అనర్హం కావడం లేదు. గతంలో జగన్ బాబాయ్ హత్యకు గురైతే హూకిల్డ్ బాబాయ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీకి .. ఇఫ్పుడు ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి చనిపోతే హూకిల్డ్ పిన్ని అంటూ వైసీపీ కౌంటర్ ప్రచారం చేస్తోంది. ఇదే క్రమంలో నగ్న వీడియోతో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్టుబడటంతో దాన్ని వైరల్ చేస్తూ ఆయనకు జగన్ ప్రమోషన్ ఇస్తున్నారంటూ టీడీపీ ఊదరగొడుతోంది.

గోరంట్ల మాధవ్ ఎపిసోడ్
న్యూడ్ వీడియోతో పట్టుబడిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైసీపీ అధిష్టానం సీరియస్ అవుతోంది. ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే సస్పెన్షన్ లేదా పార్టీ నుంచి సాగనంపుతామని హెచ్చరికలు పంపుతోంది. దీంతో మాధవ్ ఎపిసోడ్ ను పూర్తిగా రాజకీయానికి వాడుకునేందుకు టీడీపీ తెగ ప్రయత్నాలుచేస్తోంది. ఇందులో భాగంగా మాధవ్ కు జగన్ ప్రమోషన్ ఇస్తున్నారంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. దీని వెనుక గతంలో జరిగిన పలు పరిణామాల్ని తెరపైకి తెస్తోంది. దీంతో మరికొందరు వైసీపీ నేతలు కూడా ఇరుకునపడుతున్నారు.

వైసీపీకి గతాన్ని గుర్తుచేస్తున్న టీడీపీ
వైసీపీలో గతంలో రాసలీలల ఏపిసోడ్ లో పట్టుబడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడియోతో పట్టుబడిన ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు ఉదంతాల్ని టీడీపీ తెరపైకి తెస్తోంది. తద్వారా ఇప్పుడు వారి తరహాలోనే జగన్ గోరంట్ల మాధవ్ కు కూడా ప్రమోషన్ ఇస్తారా అని ప్రశ్నిస్తోంది. దీంతో గోరంట్ల మాధవ్ తో పాటు అంబటి, అవంతి కూడా ఏకకాలంలో టార్గెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వెంటనే చర్యలకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫోరెన్సిక్ నివేదిక కోసం వైసీపీ ఎదురుచూస్తోంది.
Recommended Video


గోరంట్ల మాధవ్ కు డిప్యూటీ సీఎమ్మా? కేంద్రమంత్రా
వైసీపీ నేతలకు గతంలో రాసలీలల్లో పట్టుబడినప్పుడు జగన్ వారికి ప్రమోషన్లు ఇచ్చారని ఇప్పుడు గోరంట్ల మాధవ్ కు కూడా అలాగే ప్రమోషన్ ఇస్తారని టీడీపీ నేతలు వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. అంతటితో ఆగకుండా మాధవ్ కు డిప్యూటీ సీఎం ఇస్తారా లేక ఏకంగా కేంద్రమంత్రిని చేసేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. అలా చేయకుంటే కచ్చితంగా మాధవ్ కు అన్యాయం చేసినట్లే అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్లు లేకపోవడంతో టీడీపీ నేతలు వరుసగా రెచ్చిపోతున్నారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications