Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విచారించకుండా అరెస్ట్ చేయడం ఏంటీ..? ఏసీబీ తీరుపై మాజీమంత్రి పితాని సత్యనారాయణ గుర్రు

ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో.. తెలుగుతమ్ముళ్లు రగిలిపోతున్నారు. అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. అయితే అచ్చెన్నాయుడుతో పాటు కార్మికశాఖమంత్రి పదవీని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా చేపట్టారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడంపై ఆయన స్పందించారు. అచ్చెన్నాయుడును విచారించకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.

స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా..?

స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా..?

ఒక ఎమ్మెల్యేను విచారించకుండా నేరుగా అదుపులోకి తీసుకోవచ్చా.. అని పితాని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే ఏసీబీ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి..మరీ ఆ నిబంధనను పాటించారా అని అడిగారు. ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి అని.. కానీ విచారించకుండా అదుపులోకి తీసుకోవడం మాత్రం సరికాదన్నారు. ఏసీబీ అధికారుల చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదీలా ఉందని మండిపడ్డారు.

తమిళనాడు తరహాలో...

తమిళనాడు తరహాలో...

జగన్ సర్కార్ తమిళనాడు తరహా రాజకీయాలు చేస్తుందని పితాని ధ్వజమెత్తారు. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం సరికాదని హితవు పలికారు. సభలో ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే అచ్చెన్నాయుడిని ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం అరెస్ట్ చేసిందని చెప్పారు. సభలో ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుడు లేకుండా చూసేందుకే ఇలా చేసిందన్నారు. రాగ, ద్వేషాలకు అతీతంగా పాలన సాగించాలని, కానీ ఆ విషయాన్ని జగన్ మరచిపోయారన్నారు. ప్రభుత్వం చట్టాలను గౌరవించడం నేర్చుకోవాలని.. చట్టాన్ని తమ చుట్టం చేసుకోవద్దని హితవు పలికారు.

Recommended Video

    TDP Atchannaidu Arrest || ఈఎస్ఐ స్కామ్‌లో టీడీపీ ముఖ్యనేత అచ్చెన్నాయుడు పాత్ర....!!
    గతంలో పితాని మంత్రిగా..

    గతంలో పితాని మంత్రిగా..

    గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ కూడా పనిచేశారు. కానీ ఈఎస్ఐ స్కాంపై అచ్చెన్నాయుడిపై మాత్రం ఆరోపణలు వచ్చాయి. రూ.150 కోట్ల కుంభకోణంలో ఆయన పాత్ర ఉంది అని ఏసీబీ ఆరోపిస్తోంది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నది. కానీ టీడీపీ మాత్రం కక్షపూరితంగా అరెస్ట్ చేసిందని నిరసనలకు దిగింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+