పోటెత్తిన మహిళా ఓటర్లు - ఎక్కడెక్కడ, ఎవరికి అనుకూలం..!!

ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ఆరంభం సమయానికే భారీగా ఓటర్లు తరలి వచ్చారు. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్దులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. పార్టీల నేతలు ఫలితం పైన అంచనా వేస్తున్నారు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి రావటంతో ఫలితాల పై ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. దీంతో, రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.

40.26 శాతం నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఆరు గంటల్లో 40.26 శాతం మేర పోలింగ్ నమోదు రికార్డు అయింది. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ నమోదు అయింది. తర్వాతి స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ రికార్డు అయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు అయింది. పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం మేర పోలింగ్ నమోదైంది.

Women and old age voters are voting hugely in Rural area 40 26 polling percentage records

ఏ జిల్లాలో ఎంత
ఇక, జిల్లాల వారీగా అల్లూరు లో 32.80 శాతం, అనకాపల్లి 37 శాతం, అనంతపురం 39.82, అన్నమయ్య 39.60, బాపట్ల 44.45, చిత్తూరు 44.50, కోనసీమ 44.03, తూ.గో 38.54, ఏలూరు 38.76, గుంటూరు 40.12,కాకినాడ 38.25, కృష్ణా 44.50, కర్నూలు 38, నంద్యాల 44.20, ఎన్టీఆర్ 39.60, పల్నాడు 40.53, పార్వతిపురం మన్యం 34.87, ప్రకాశం 42.78, నెల్లూరు 42.38, సత్యసాయి 38.10, శ్రీకాకుళం 40.56, తిరుపతి 39.14,విశాఖ 33.72, విజయనగరం 40.30, ప.గో 39.50, కడప జిల్లాలో 45.56 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడు, చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

Women and old age voters are voting hugely in Rural area 40 26 polling percentage records

కలిసొచ్చేదెవరికి
పెరుగుతున్న పోలింగ్ శాతం.. పెద్ద ఎత్తున కనిపిస్తున్న మహిళా ఓటర్లతో ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు మొలయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలతో పాటుగా వృద్దులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అర్బన్ ప్రాంతాల్లో ఉదయ నుంచే భారీగా పోలింగ్ జరిగింది. దీంతో..ఎవరి ఓట్ బ్యాంకు ఎక్కడ తమకు అనుకూలంగా పోలయిందనే లెక్కల పైన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ పూర్తయ్యే సమయానికి పోలింగ్ శాతం ఎంత నమోదవుతుంది.. ఓటింగ్ సరళి పైన పార్టీలకు స్పస్టత వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+