4 గంటల పాటు నరక యాతన.. కాన్పు తర్వాత బిడ్డను చూసి డాక్టర్లు షాక్
ఆ ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న ప్రసవాన్ని కూడా సహజంగా జరిపారు. పండంటి మగ బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. శిశువు బరువు 4.8 కేజీలు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి సర్జరీ లేకుండా వుడ్స్ కార్క్ స్క్రూ విధానంలో ఇంతటి గొప్ప పురుడు పోసిన వైద్యులపై సర్వత్రా ప్రశంసలు గుప్పిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా పెందూర్తి ప్రాంతానికి చెందిన కె. రూపవతి (25) 9 నెలలు నిండడంతో నొప్పులతో మంగళవారం అర్థరాత్రి జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఈమెకు 8 నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా శిశువు బరువు 3 కేజీలుగా ఉన్నట్లు భావించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ లేదా సహజ ప్రసవం చేసేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రోబో సినిమా టైప్ లో అనూహ్యంగా రూపవతికి తొలి ప్రసవం సహజ విధానంలో జరిగింది.
భుజాలు బయటకు రావడంలో అవరోధం!
శిశువు తల ముందుకు వచ్చినప్పటికీ భుజాలు రావడంలో సమస్య తలెత్తింది. శిశువు బరువుగా ఉన్నందున తల ముందుకు వచ్చినట్లు భుజాలు బయటకు వచ్చేందుకు సాధ్యపడలేదు. సిజేరియన్ తప్పదేమో అని అనుకున్నారు. అయితే.. 'వుడ్స్ కార్క్ స్క్రూ ' (మ్యాన్అవర్) విధానంలోని మెళుకవలను పాటించి, భుజాలు బయటకు వచ్చేలా వైద్యులు చేశారు. దీనివల్ల సిజేరియన్కు బదులు సహజ ప్రసవం జరిగింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సెకండరీ ఆసుపత్రుల్లో ఇలాంటివి జరగడం చాలా అరుదు అని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. సుమారు 4 గంటలపాటు వైద్యులు డాక్టర్ సౌజన్య డాక్టర్ మానస (పీజీ థర్డ్ ఇయర్ స్టూడెంట్), స్టాఫ్ నర్సులు జగదీశ్వరి, జే.కుమారి, ఏఎన్ఎం శ్రమించారని తెలిపారు.

రిస్కు అధికoగా ఉన్నా..
ఒక్కోసారి బరువు అధికంగా ఉన్న శిశువులకు ఊపిరి తీసుకోవడం కష్టం కావొచ్చు అలాగే తల్లికి బ్లీడింగ్ సమస్య ఎక్కువవుతుంది. ఇవికాకుండా పెర్నియల్ టియర్ (యోని చీలిక) వంటి తలెత్తే ఇతర సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని వైద్యులు తీసుకున్న జాగ్రత్తలవల్ల సహజ ప్రసవం సాధ్యమైంది. సాధారణంగా ఇలాంటి పద్ధతులు బోధనాసుపత్రులు, కార్పొరేటు ఆసుపత్రుల్లో జరుగుతుంటాయి. వీటికి భిన్నంగా అనకాపల్లి జిల్లా అసుపత్రిలో అసాధారణ రీతిలో సహజ ప్రసవం జరగడం విశేషం. అధిక బరువు కలిగిన శిశువులను మాక్రోసోమియా కేసుగా పరిగణిస్తారు ప్రసవ సమయంలో తల్లికి, బిడ్డకు రిస్కు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా వైద్యులు 4 కేజీలు లేదా 4. 5 కేజీలు అంతకంటే ఎక్కువ బరువు కలిగిన శిశువులకు సిజేరియన్ సెక్షన్ సూచించే అవకాశాలు ఎక్కువ కానీ వైద్యులు చూపిన చొరవతో సహజ ప్రసవం జరిగినందున శిశువు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications