Amaravati: అమరావతిపై ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం..! చంద్రబాబు ప్రతిపాదనకు..

అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న వేళ ప్రపంచ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఇతర అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలు కూడా తోడ్పాటు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇదే క్రమంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ తొలి అడుగు వేయగా.. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ రెండో అడుగు వేసింది..

world bank approved 800 million dollor loan for Amaravati capital

అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15 వేల కోట్ల రుణాలు ఇప్పించేందుకు హామీగా ఉంటామని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించింది. అనంతరం అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిపి ఈ మొత్తం సమకూర్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండు అంతర్జాతీయ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు అమరావతి రాజధానిలో విస్తృతంగా పర్యటించడంతో పాటు సీఎం చంద్రబాబు, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం తమ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సమర్పించారు.

తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు అమరావతి రాజదాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను ఆమోదించడంతో పాటు 788 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కూడా అదే బాటలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానికి 800 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనకు ఇవాళ ఆమోదముద్ర వేసింది. ప్రపంచ బ్యాంక్ బోర్డు భేటీలో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+