XLRI: సీఎంగా చంద్రబాబు మార్క్.. అమరావతికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్ళీ అమరావతికి కొత్త శోభ వస్తుంది. గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో రాజధాని అమరావతి పట్టించుకునే నాధుడు లేక, జగన్ నిర్లక్ష్యం కారణంగా నాశనం అయ్యింది. ఇక అమరావతిలో పట్టుబడులు పెట్టే నాధుడే లేని పరిస్థితి జగన్ పాలనలో కనిపించింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
అమరావతికి మంచిరోజులొచ్చాయి
అమరావతికి మంచి రోజులు వచ్చాయి. సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు.అమరావతిలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అమరావతిని బూడిద నుండి బంగారం చేసే పని మొదలుపెట్టిన చంద్రబాబు అమరావతిలో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు.

అమరావతిలో ఇన్స్టిట్యూట్ ప్రారంభించేందుకు XLRI సుముఖత
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపించటంతో పాటు, అమరావతికి శుభారంభంగా దేశంలోనే అత్యుత్తమ మేనేజ్మెంట్ సంస్థగా గుర్తింపు పొందిన XLRI అమరావతిలో తమ ఇన్స్టిట్యూట్ ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మేనేజ్‍మెంట్ కోర్సుల్లో తరగతులు, శిక్షణ ఇవ్వడంలో XLRIకు దేశంలోనే చాలా మంచి పేరుంది. మేమేజ్మేంట్ సంస్థలలో అహ్మదాబాద్ IIM తర్వాత XLRI కు స్థానం ఉంది.
గతంలో టీడీపీ హయాంలో అమరావతిలో ఏర్పాటుకు ఆసక్తి చూపిన సంస్థ
మేనేజ్‍మెంట్ ఇన్‍స్టిట్యూట్‍లో దేశంలో ప్రఖ్యాతిగాంచిన XLRI అమరావతిలో తమ సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో XLRIకు CRDA 50 ఎకరాలు కేటాయించింది. అంతేకాదు XLRIకు భూమిని రిజిస్టర్ చేసిన CRDA అమరావతిలో ఇన్‍స్టిట్యూట్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైసీపీ హయాంలో వెనక్కు.. మళ్ళీ చంద్రబాబు హయాంలో ముందుకు
కానీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ఓటమి, ఆపై వైసీపీ ప్రభుత్వం రావటం జరిగింది. ఈ క్రమంలో తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం XLRI అభివృద్ధి పనులకు అడ్డుపడడంతో ఎక్స్‌ఎల్ఆర్ఐ పనులు నిలిపివేసి వెనక్కి వెళ్లిపోయింది. మళ్ళీ చంద్రబాబు సీఎం కావటంతో ఇన్‍స్టిట్యూట్ ఏర్పాటుకు ముందుకువచ్చిన XLRI భూములు అప్పగిస్తే వెంటనే నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. దీంతో XLRIకు వెంటనే భూమి అప్పగించేందుకు CRDA సిద్ధమైంది. సుమారు రూ.250 కోట్లతో XLRI భవన నిర్మాణాలు చేపట్టనుంది.












Click it and Unblock the Notifications