ఐటీ, ఈడీని ప్రశ్నిస్తున్న టీడీపీ - ఏం జరుగుతోంది..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. జగన్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అటు సోదరి షర్మిల జగన్ పైన ఆస్తుల వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటు షర్మిల షేర్ల అమ్మకం పైన జగన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ సమయంలోనే జగన్ ఆస్తులు, ఆదాయం లెక్కల పైన ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ విచారణ సంస్థలను ప్రశ్నించటం ఆసక్తి కరంగా మారింది.

మాజీ సీఎం జగన్ - షర్మిల ఆస్తుల వివాదం పై టీడీపీ సీనియర్ నేత యనమల స్పందించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయనడానికి జగన్ ఉదాహరణగా పేర్కొన్నారు. ఎన్‌సీఎల్‌టీలో తల్లిపై, చెల్లిపై కేసులేయడం ద్వారా జగన్ పూర్తిగా పాతాళానికి కూరుకుపోయారన్నారు. ఇది ఆస్తుల వివాదం కాదని.. ఇది రాజకీయ ఆత్మహత్యే అని.. చివరికి జగన్ తన సొంత తల్లిని, చెల్లిని కూడా మోసం చేశారంటూ మండిపడ్డారు. షర్మిలకిచ్చిన రూ.200 కోట్లు జగన్‌‌కు ఎక్కడివని ప్రశ్నించారు. 10 ఏళ్లలో రూ. 200 కోట్లు ఇచ్చానని జగన్ పేర్కొన్నా ఇప్పటికీ ఐటీ, ఈడీ ఎందుకు స్పందించడంలేదంటూ కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ నేత యనమల ప్రశ్నించటం చర్చనీయాంశంగా మారుతోంది.

yanamala reacts on Jagan properties controversy questioned investigation agencies

జగన్ ఆస్తుల వివాదం బహిరంగంగా జరుగుతుంటే దర్యాప్తు సంస్థల్లో కదలిక లేదంటూ వ్యాఖ్యానించారు. కేసులను ఇప్పటికైనా ఒక కొలిక్కి తేవాలని కోరారు. 11 ఏళ్లుగా జగన్ బెయిల్‌పై ఉండటమేమిటని ప్రశ్నించారు. 136 డిశ్చార్జి పిటిషన్లు వేసి తనపై కేసుల విచారణను ముందుకు సాగకుండా న్యాయవ్యవస్థకే కొరుకుడు పడని కొయ్యగా మారారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలకే పెను సవాళ్లు విసురుతుంటే రాజ్యాంగం ఉనికికే ప్రమాదమన్నారు. ఇప్పటికే అనేక మంది వైసీపీని వీడుతున్నారని.. సురక్షిత ఆశ్రయం కోసం వేరే పార్టీల్లో చేరుతున్నారన్నాని యనమల పేర్కొన్నారు.

ఇక భవిష్యత్తులో జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే అని యనమల వ్యాఖ్యానించారు. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని.. పాత కేసులకు తోడు కొత్త కేసులు అనేకం ఆయన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్‌తో ఉంటే అది ఆత్మహత్యాసదృశ్యమే అంటూ వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం సొంత చిన్నాన్న కుటుంబాన్నే మోసం చేశారన్నారు. చిన్నాన్నను కిరాతకంగా హత్య చేసిన హంతకులకు రక్షణ కల్పించడమే కాదని.. ఆ పాపంలో తానూ భాగస్వామి అయ్యారని ఘాటు విమర్శలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+