'ఆస్తులను అప్పగించండి, జగన్‌కు రివర్స్, వైసిపి మైండ్ బ్లాంక్'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శిక్ష నుంచి తప్పించుకునేందుకే పాదయాత్రను తెరపైకి తీసుకు వచ్చారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

దమ్ముందా అని నిలదీసినా: జగన్ పదేపదే అదే పొరపాటు చేస్తున్నారా? బాబు సుందరముఖం అంటూ..

జగన్‌కు ప్యాకేజీ అంటే అర్థం తెలుసా

జగన్‌కు ప్యాకేజీ అంటే అర్థం తెలుసా

జగన్‌కు అసలు ప్రత్యేక ప్యాకేజీ అంటే అర్థం తేలుసా అని యనమల నిలదీశారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని, కానీ అక్రమాస్తుల కేసులో ఆయన ఎట్టి పరిస్థితుల్లోను శిక్షను తప్పించుకోలేరని చెప్పారు.

Ys Jagan Seeks Blessings From Godmen Chinna Jeeyar Swami చినజీయర్‌ స్వామి తో జగన్ | Oneindia Telugu
జగన్‌కు రివర్స్ అయింది, రోడ్లపై తిరిగేవాడిలో మాట్లాడొద్దు

జగన్‌కు రివర్స్ అయింది, రోడ్లపై తిరిగేవాడిలో మాట్లాడొద్దు

కరువుకు ప్రతిరూపం చంద్రబాబు అని చెప్పే ప్రయత్నం జగన్ చేశారని మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ శ్రీశైలం నిండింది, వైసిపి కడుపు మండిందని ఎద్దేవా చేశారు. వైసిపి మైండ్ బ్లాంక్ అయిందన్నారు. జగన్ రోడ్లపై తిరిగేవాడిలా మాట్లాడవద్దని హితవు పలికారు.

జగన్ పాదయాత్రపై కంభంపాటి షరతు

జగన్ పాదయాత్రపై కంభంపాటి షరతు

వైసిపి అధినేత జగన్ పాదయాత్రపై కంభంపాటి రామ్మోహన్ మండిపడ్డారు. జగన్‌లా అక్రమాలకు పాల్పడిన శశికళ, గాలి జనార్ధన్ రెడ్డిలు కూడా పాదయాత్ర చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. వారు తమ అక్రమాస్తులను ప్రజలకు అప్పగించి పాదయాత్ర చేయాలని ఆయన షరతు విధించారు.

కేంద్రాన్ని సరిగా అడగలేదు

కేంద్రాన్ని సరిగా అడగలేదు

నాడు రాష్ట్రానికి కావాల్సిన వాటిని కేంద్రాన్ని సరిగా అడగలేకపోయామని కంభంపాటి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్పారు.

జగన్! ఇకనైనా అహం వీడండి

జగన్! ఇకనైనా అహం వీడండి

వైసిపి అధినేత వైయస్ జగన్ ఇకనైనా అహం వీడాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సూచించారు. జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు కూడా అహం వీడాలన్నారు. 2019లో గెలుపు కోసం ప్రతి టిడిపి కార్యకర్త కృషి చేయాలని దేవినేని అన్నారు. పట్టిసీమ ద్వారా 7 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leaders and Ministers Yanamala Ramakrishnudu and Somireddy Chandramohan Reddy are lashed out YSR Congress Party chief YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి