రావణకాష్టంగా పల్నాడు.. పిన్నెల్లిలో బాంబులు బయటపడినా మౌనం దేనికి? : యరపతినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడులో ఎన్నికల పోలింగ్ తర్వాత జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పల్నాడులో జరుగుతున్నటువంటి దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక తాజాగా పల్నాడులో జరుగుతున్న దాడులపైన, ఈరోజు పిన్నెల్లి లో వైసీపీ నాయకుల ఇళ్లల్లో భారీగా బయటపడిన పెట్రోల్ బాంబులు, నాటు బాంబుల వ్యవహారం పైన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు.
వైసీపీ నేతలు పల్నాడును రావణ కాష్టంగా మార్చారు
నేడు మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వైసిపి నేతలు పల్నాడును రావణకాష్టంగా మార్చారని టిడిపి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు పోలీసులు ఇంకా వైసీపీ కనుసన్నలలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను నియంత్రించడంలో ఎన్నికల సంఘం కూడా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల పోలింగ్ నాడు ఆ తరువాత జరిగిన దాడులను నియంత్రించడంలో రాష్ట్ర డిజిపి ఇంకా చీఫ్ సెక్రెటరీ కూడా పూర్తిగా విఫలమయ్యారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం ఇంకా వైసీపీ కనుసన్నలలోనే పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.
పిన్నెల్లి లో బాంబులు బయటపడినా పోలీసుల మౌనం
ఈరోజు మండలం పిన్నెల్లి గ్రామంలో భారీగా బాంబులు బయటపడ్డాయని పేర్కొన్న ఆయన, రాత్రి బాంబులు బయటపడినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు మౌనంగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. బాంబులు బయటపడిన విషయం బయటకు తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచడం వెనుక ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీకి అరాచకాలు కావాలంటూ వ్యాఖ్యలు
ఈ వ్యవహారంలో పోలీసులు వైసీపీ నేతలను కేసుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారని అనుమానంగా ఉందని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీకి పల్నాడు అభివృద్ధి కావాలని, కానీ వైసీపీకి అరాచకాలు కావాలంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరాచక వాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దాడులతో, హింసతో టీడీపీని భయపెట్టలేరన్నారు. ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications