కొడాలి నాని..అంకుశం సినిమాలో రామిరెడ్డిలా - నిన్ను రోడ్డు పైన కొట్టుకుంటూ : యరపతినేని వార్నింగ్..!!
టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు మంత్రి కొడాలి నాని పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న కొడాలి నాని పైన మాజీ ఎమ్మెల్యే ఈ స్థాయిలో హెచ్చరికలు చేయటం రాజకీయ చర్చగా మారుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు- లోకేష్ పై మంత్రి కొడాలి నాని అవకాశం వచ్చిన ప్రతీ సందర్బం లోనూ ఫైర్ అవుతున్నారు. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని.. జగన్ పార్టీ పెట్టిన తరువాత టీడీపీ విప్ ను ధిక్కరించి అనర్హత వేటుకు గురయ్యారు.

కొడాలి నాని మాట్లాడితే..స్పందన ఉండదని
ఆ తర్వాత కొడాలి నాని వైసీపీ లో చేరారు. ఇప్పటికి రెండు సార్లు టీడీపీ నుంచి.. రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొడాలి నాని టీడీపీ పైన విరుచుకుపడటంలో ముందుంటారు. చంద్రబాబు- లోకేష్ పైన వ్యక్తిగతంగా ఆయన చేసే విమర్శలకు ఒక్కో సారి టీడీపీ నేతలు సైతం స్పందించరు. ఆయన నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో జనసేన అధినేత పవన్ సైతం కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేసారు. అదే స్థాయిలో మంత్రి వాటిని తిప్పి కొట్టారు.

యరపతినేని తాజా వార్నింగ్- అంకుశం సినిమాలో లాగా..
ఇక, తాజాగా టీడీపీ సీనియర్ నేత- గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు మంత్రి కొడాలి నాని గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన గురజాల నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం లో మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేసారు. ఆ సమావేశంలో మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి.. కొడాలి నానికి ఒక్కటే చెబుతా ఉన్నాను. మా ప్రభుత్వం వచ్చిన గంటలో అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు బజారులో కొడుతూ తీసుకెళ్తా. అధికారం శాశ్వతం కాదు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ నుంచే నీవు వచ్చావు. చంద్రబాబు బిక్ష పెడితే నీవు ఎమ్మెల్యే అయ్యావని వ్యాఖ్యానించారు.

యరపతినేని వ్యాఖ్యల కలకలం
టీడీపీలో గతంలో ఉన్నావు..చరిత్ర మర్చిపోవద్దు..అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ కూర్చోం...అంటూ తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2019 ఎన్నికల్లో గురజాలతో యరపతినేని శ్రీనివాస రావు వైసీపీ అభ్యర్ధి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. జిల్లాలో సీనియర్ నేతగా ఉండటంతో ఆయనకు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా అవకాశం వస్తుందని అంచనా వేసారు.
Recommended Video

మంత్రి కొడాలి నాని స్పందిస్తారా..
ఆ తరువాత 2017లో జరగిన మంత్రివర్గ విస్తరణలో అయినా ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ, అవకాశం రాలేదు. ఆ సమయంలో లోకేష్ తో సమావేశమైన యరపతినేని తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ప్రకటించారు. మంత్రి కొడాలి నాని చేసే వ్యాఖ్యల పైన ఏ టీడీపీ నేత ఇప్పటి వరకు తీవ్రంగా స్పందిచలేదు. కానీ, మంత్రి పైన ప్రతిపక్ష నేత చేసిన కామెంట్లు..అందులోని తీవ్రత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని పైన మంత్రి నాని - వైసీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications