పవన్ ముందు వైసీపీ కొత్త డిమాండ్, ఉద్యమానికి సిద్దం..!!

విశాఖ కేంద్రంగా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో తాజాగా 32 విభాగాలను ప్రయివేటీకరణ దిశగా టెండర్లు జారీ చేసారు. దీంతో, స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రజా సంఘాలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని వైసీపీ యోచిస్తోంది. అందులో భాగంగా విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలోనూ వైసీపీ నేతలు తీర్మానం కోసం డిమాండ్ చేసారు. ఇక.. డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా వైసీపీ సీనియర్ నేత బొత్సా కీలక డిమాండ్ తెర మీదకు తెచ్చారు.

మాజీ మంత్రి బొత్సా విశాఖ స్టీల్ ప్లాంట్ లో తాజా పరిణామాల పైన స్పందించారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని.. ఎమ్మెల్యేల పై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్యేల పై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెబుతారు. .కానీ, చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. పెన్షన్లు తెలిగిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 30 లోపు సమస్య పరిష్కరించాలని బొత్సా డిమాండ్ చేసారు. దివ్యాంగుల తరపున వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.

ycp-leader-botsa-demands-pawan-reaction-on-latest-decisions-in-steel-plant

స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని శాసన మండలి సాక్షిగా పవన్, లోకేష్ చెప్పారని బొత్సా గుర్తు చేసారు. తాజాగా 32 విభాగాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ప్రశ్నించారు. కూటమి నేతలు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని చెప్పారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ వైఖరి చెప్పాలని కోరారు. ఈ నెల 30వ తేదీన విశాఖలో జరిగే జనసేన సభలో డిప్యూటీ సీఎం పవన్ స్టీల్ ప్లాంట్ పైన తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. ప్రధాని విశాఖ పర్యటన వేళ గిన్నీస్ బుక్ గురించి ఆలోచించిన కూటమి నేతలు.. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని చెప్పారు. రాజకీయ, ప్రజా - కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేస్తామని.. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొత్సా స్పష్టం చేసారు. అవసరం అయితే, ప్రధాని వద్దకు వెళ్తామని బొత్సా వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+