తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ వేళ కీలక పరిణామాలు..!!
తాడిపత్రి రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పెద్దారెడ్డి.. అసలు అవకాశమే లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పంతం పట్టారు. పెద్దారెడ్డి తాడిపత్రి ప్రవేశం అంశం న్యాయస్థానాలకు చేరింది. తాజాగా సుప్రీంకోర్టు పెద్దారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో, తాడిపత్రిలోకి పోలీసు బందోబస్తుతో వెళ్లేందుకు పెద్దారెడ్డి సిద్దమయ్యారు. ఇదే సమయం లో జేసీ వర్గం అప్రమత్తం అయింది. ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్దారెడ్డి ఎంట్రీ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. సుప్రీం ఆదేశాలు ఉండటంతో.. ఇప్పుడే ఎలాగైనా తాడిపత్రిలోకి వెళ్లాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు తనకు అనుమతి ఇవ్వాలని పోలీసు అధికారులను కోరుతున్నారు. వైసీపీ ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి వెళ్లేందుకు అవకాశం లభించ లేదు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ససేమిరా అంటున్నారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా పెద్దారెడ్డిని పోలీసులు అనుమతించటం లేదు. కాగా, పెద్దారెడ్డి తొలుత హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు . అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరో కార్యక్రమం నిర్వహించారు.

దీంతో, ఈ వ్యవహారం హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లింది. అక్కడ ఆదేశాలు తనకు అనుకూలంగా లేకపోవటంతో పెద్దారెడ్డి సుప్రీంకు వెళ్లారు. సుప్రీంకోర్టులో విచారణ తరువాత పెద్దారెడ్డి తాడిపత్రి కి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. సుప్రీం ఆదేశాలతో పెద్దారెడ్డి సోమ, మంగళవారాల్లో తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఆయన బాధితులే అడ్డుకుంటారని వ్యాఖ్యానించారు. తాడిపత్రికి మంచి చేశాం కాబట్టే 40 ఏళ్లుగా ప్రజలు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అటు కోర్టు ఉత్తర్వులు.. ఇటు స్థానిక పరిస్థితులతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications