ఎట్టకేలకు తాడిపత్రిలోని ఇంటికి చేరిన పెద్దారెడ్డి - 15 నెలల తరువాత..!!
తాడిపత్రి రాజకీయాల్లో కీలక పరిణామం. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలోని తన ఇంటికి చేరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాడిపత్రిలోకి వచ్చేందుకు పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం.. స్థానిక పరిస్థితులతో సాధ్యపడలేదు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు నడుమ 15 నెలల తరువాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రయత్నం ఫలించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రిలోకి పెద్దారెడ్డి అడుగు పెట్టలేదు. అనేక ప్రయత్నాలు చేసినా స్థానికం గా జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి వచ్చిన అభ్యంతరాలు.. రాజకీయ సవాళ్లతో పరిస్థితి హీట్ ఎక్కంది. పెద్దారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన దౌర్జన్యాల గురించి జేసీ ప్రశ్నించారు. పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి ఎంట్రీ లేదని తేల్చి చెప్పారు. జేసీ, పెద్దారెడ్డి వర్గాల మధ్య తాడిపత్రిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీంతో, పోలీసులు సైతం పెద్దారెడ్డి ఎంట్రీకి అనుమతించ లేదు. దీంతో.. పెద్దారెడ్డి తొలుత హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సానుకూలంగా వచ్చినా స్థానిక పరిస్థితి అనుకూలంచక లేదు.

ఆ తరువాత పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వస్తే సమస్యలు జటిలంగా మారుతాయని దాఖలైన పిటీషన్ పైన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీని పైన పెద్దారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. ఇక.. బందోబస్తు ఖర్చు తాను భరిస్తానని పెద్దారెడ్డి హామీ ఇవ్వటంతో.. సుప్రీం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రి చేరుకున్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా 300 పోలీసుల భద్రత మధ్య తాడిపత్రికి పెద్దారెడ్డి చేరుకునేలా ఏర్పాట్లు చేసారు. 15 నెలల తరువాత తాడిపత్రిలోకి పెద్దారెడ్డి రావటంతో ఆయన అనుచరులు తరలి వస్తున్నారు. దీంతో.. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానని పెద్దారెడ్డి చెప్పారు. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని.. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పెద్దారెడ్డి చెప్పకొచ్చారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications