చంద్రబాబుకు కరుణానిధి పరిస్థితి ఎదురు కాలేదు, సంతోషించండి, వైసీపీ కౌంటర్ !
విజయవాడ/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అయితే ఎలాంటి దురుద్దేశం లేకుండానే చట్టపరంగా చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారని, ఇంతకాలం క్షుణ్ణంగా విచారణ చేసిన తరువాత సీఐడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి అంటున్నారు.

ఇందుకు ఓ కారణం కూడా ఉంది. శనివారం ఉదయం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చంద్రబాబు అరెస్టులో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులు సాధించలేదని, సీఐడీ అధికారులు వారిపని వారు చేసుకుంటూ వెలుతున్నారని సజ్జల క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సజ్జల కరుణానిధిని అరెస్టు చేసినట్లు చంద్రబాబును ఇక్కడ ఎవ్వరూ అరెస్టు చెయ్యలేదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పక్కా సామాచారం సేకరించిన సీఐడీ అధికారులు మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేశారాని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సమర్థించుకున్నారు.
జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అప్పటి తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు ఎం. కరుణానిధిని స్థానిక పోలీసులు అర్దరాత్రి అరెస్టు చేశారు. జయలలిత సీఎంగా ఉన్న సమయంలో డీఎంకే పార్టీ నాయకులు అర్దరాత్రి పూల అరెస్టులు అయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే కరుణానిధిని అరెస్టు చేసినట్లు మేము చంద్రబాబును అర్దరాత్రి అరెస్టు చెయ్యలేదు కదా ?అని ఇప్పుడు వైసీపీ నాయకులు ఎదురుదాడిగి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications