గుడివాడలో సీఎం ఎంట్రీ, కొడాలి నాని జంప్, ఎన్డీఆర్ రుణం తీర్చుకోలేము
స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సందర్భంగా గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. గుడివాడ ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుందని, ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవడానికి తాము జీవితాంతం కష్టపడి పని చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
గుడివాడ నుండి పోటీ చేసిన నందమూరి తారక రామారావు తరువాత సీఎం అయ్యారని, ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని, సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే తిరుమలకు వెళ్లిన ఎన్డీఆర్ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గుడివాడలో కూటమి ప్రభుత్వం మూడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. పక్క ప్లాన్ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారని తెలిసింది.

సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటన సందర్బంగా మాజీమంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నాని, వైసీపీ కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గుడివాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గుడివాడలో వైసీపీ కార్యకర్తలు ఎక్కడా తోక తిప్పకుండా పోలీసులు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గుడివాడలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అన్న క్యాంటీన్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుపై పదేపదే తీవ్రస్థాయిలో పురుష పదజాలంతో ఆరోపణలు చేసిన మాజీ మంత్రి కొడాలి నాని తో పాటు ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు గుడివాడలో ఎక్కడా కనిపించలేదు.
గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మొత్తం మీద గుడివాడలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా గుడివాడలో ఎక్కడకూడా వైసీపీ జెండాలు, ఆ పార్టీ నాయకులు కనపడకుండా పోవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications