Topudurthi: చంద్రబాబు - పరిటాలపై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు..!!

Raptadu MLA Topudurthi Prakash Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా తనతో పాటుగా లోకేశ్ ను చంపేసేవారమని రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు వ్యాఖ్యానించటం వారి అరాచకానికి పరాకాష్టగా పేర్కొన్నారు. బాబాయిని చంపినంత సులువు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడతామా అని ప్రశ్నించారు.

ఈ వ్యాఖ్యలకు రాప్తాడు ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన మండి పడ్డారు. పరిటాల అనుచరుడు జగ్గుతో తన తల్లిని తిట్టించారని ప్రకాశ్ రెడ్డి చెప్పారు. తల్లిని తిడితే కొడుకులుగా తమకు బాధ ఉండదా అని ప్రశ్నించారు. జగ్గు వ్యాఖ్యలకు ఏ టీడీపీ నేత ఖండించలేదన్నారు. కాటికి కాలు చాచిన చంద్రబాబును చంపే అవసరం ఎవరికి ఉంటుందంటూ ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాప్తాడులో జరుగుతున్న పరిణామాల్లో ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 150 హత్యలు జరిగాయన్నారు. మాజీ ఎమ్మెల్యేలు చెన్నారెడ్డి, మద్దెల చెరువు నారాయణరెడ్డి కుటుంబాలను పరిటాల చంపించారని ఆరోపించారు. మద్దెలచెరువు సూరిని చంపించారని ఆరోపణలు చేసారు.

YCP Raptadu MLA Topudurthi Prakash Reddy sensational comments on Chandra Babu and Paritala

తన సోదరుడు సోదరుడు చందును పరిటాల రవి చంపుతానని బెదిరించారని చెప్పారు. పరిటాల శ్రీరాం తనను చంపుతానంటూ బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. హింసా రాజకీయాల పై పరిటాల కుటుంబం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు ప్రాణహాని కలుగుతుందన్న బాధతో తన అన్న మాట్లాడి ఉండవచ్చన్నారు. తన అన్న మాట్లాడిన భాష మీద తమ పార్టీ పెద్దలు మందలించారని వివరించారు. దీంతో, తాము క్షమాపణ చెప్పామని, మరి తన తల్లిని తిట్టిన దానికి ఒక్క టీడీపీ నేత అయినా తప్పు అని చెప్పారా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ప్రకాశ్ రెడ్డి మరో కీలక నిర్ణయం వెల్లడించారు. రాప్తాడులో 3వ తేది నుంచి 14వ తేదీ వరకు జనంలోకి వెళ్తామని ప్రకటించారు. వెళ్లిన ప్రతి చోటా తాము చేసిన అభివృద్ధి.. వారు చేస్తున్న అరాచకాలు వివరిస్తామని ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+