Year Ender 2024: పవన్ కు తీపి గుర్తుగా ఈ ఏడాది-జాతీయ స్దాయికి ప్రమోషన్ ..!

ఏపీలో జనసేన పార్టీ ఛీఫ్ గా ఉన్నపవన్ కళ్యాణ్ కు ఈ ఏడాది అందరి కంటే ఎక్కువగా కలిసొచ్చింది. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయి, తన పార్టీకి సైతం ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలిపించుకున్న పవన్ ను చేరదీసిన బీజేపీ.. చివరికి మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రంలో సైతం ఆయనతో ప్రచారం చేయించే స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వినిపిస్తున్న సనాతన ధర్మ సిద్ధాంతాలతో ఆయన బీజేపీ కన్నుసన్నల్లో ఎదుగుతున్న ఓ జాతీయ స్థాయి నేతగా కనిపిస్తున్నారు.

2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత రూటు మార్చిన పవన్ కళ్యాణ్ అంతవరకూ తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలతో సంబంధం లేకపోయినా అప్పట్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న పవన్ నిర్ణయం అందరికీ చిత్రంగానే అనిపించింది. అయినా బీజేపీతో అంతగా అంటకాగలేదు. దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ 2023లో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనకు మద్దతు ప్రకటించి వచ్చిన పవన్ ఆ తర్వాత బీజేపీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఏపీలో ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికలకు వెళ్లి జనసేనతో పాటు కూటమినీ గెలిపించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యారు.

Year Ender 2024 memorable year for pawan kalyan elevated from state to national level

అదే సమయంలో 2024 ఎన్నికల్లో తమిళనాడు, కర్నాటక కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు పవన్ కళ్యాణ్. తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాలు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ ను తప్పనిసరిగా అక్కడ వాడుకోవాలని నిర్ణయానికి వచ్చేసిన బీజేపీ.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రచారానికి ఆయన్ను వాడుకుని ప్రయోజనం పొందింది. ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పవన్ రెండు రోజుల ప్రచారం చేసి వచ్చారు. ఆయా సీట్లలో బీజేపీ గెలవడంతో పవన్ ప్రచారం సక్సెస్ అయినట్లయింది.

అంతకు ముందే తిరుమల లడ్డూ వ్యవహారంలో సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ గా తనను తాను అభివర్ణించుకుంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో పవన్ వ్యాఖ్యలపై దేశంలో పలు పార్టీల నేతలు స్పందించడం మొదలుపెట్టారు. అలా బీజేపీ అజెండాలో ఉన్న పలు అంశాల్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ సాగిపోతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకి ఆశాదీపంలా కనిపిస్తున్నారు. అదే క్రమంలో జాతీయ నేతగా కూడా ఎదుగుతున్నారు.
అలా ఏడాది కాలంలో ఏమీ లేని స్దాయి నుంచి జాతీయ స్థాయి నేతగా, డిప్యూటీ సీఎంగా పవన్ మారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+