డబ్బులు చెట్లకే కాస్తాయి!
ఇంట్లో డబ్బులు అడిగినప్పుడల్లా డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా? అంటారు. చెట్లకు డబ్బులు కాయకపోయినప్పటికీ వర్షంలా కురిపించే చెట్లున్నాయి. దీనికి మనం చేయాల్సింది ఒకటే.. మనకున్న స్థలంలో 5 రకాల చెట్లను పెంచడమే. అవే మనల్ని ధనవంతులుగా చేస్తాయి.
కరెన్సీ నోట్లు చెట్లకు కాయవు. కాకపోతే ఆ చెట్ల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందుకు ఓపిక, సహనం వహిస్తే దాని ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది.కొన్ని రకాల మొక్కలను నాటాలి. అవి 8-10 సంవత్సరాల తర్వాత చెట్టుగా మారి డబ్బులు కురిపిస్తాయి. చెట్టు పెరిగిన తర్వాత కేవలం ఆదాయం మాత్రమే వస్తుంది. అవేం చెట్లు? వాటిని నాటడం వల్ల ఎంత లాభం వస్తుందో తెలుసుకుందాం.
టేకు చెట్టు: కలపకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అత్యంత ధృడమైన కలపగా ప్రసిద్ధి. ఇంటి నిర్మాణంతో పాటు ఫర్నిచర్, డెకరేషన్ వంటి వస్తువులను తయారు చేయాలన్నా మొదటి ప్రాధాన్యత కలపకే ఇస్తారు. టేకు చెట్టును కలప రాజుగా చెప్పొచ్చు. చెట్టు పెరగడానికి 12 సంవత్సరాల సమయం పడుతుంది. 25-30 వేల రూపాయల ఆదాయం లభిస్తుంది.

ఫిర్ చెట్టు: ఈ చెట్టు నాటడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. దీనికి నీరు ఎక్కువగా కావాలి. ఎటువంటి ప్రత్యేక నిర్వాహణ లేకుండానే పెరుగుతుంది. ఈ చెట్టు పెద్దదవడానికి 10 ఏళ్లు పడుతుంది. ఈ చెట్టు నుంచి ఖరీదైన ఔషధ తైలం తీస్తారు.
గంధపు చెట్టు: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చెట్లలో ఒకటి ఇది. కిలో గంధం కలప రూ.27వేలు ఉంది. ఒక్కో చెట్టు 15-20 కిలోల కలపను ఇస్తుంది. శ్రద్దగా, కాస్త ఓపికగా ఒక్క గంధం చెట్టును పెంచినా అదే మిమ్మల్ని లక్షాధికారుల్ని చేస్తుంది. ఎన్ని ఎక్కువ చెట్లు పెంచుకుంటే అంత ఎక్కువ నగదు వస్తుంది.
కుండ చెట్టు: ఈ రకం చెట్టును ఎకరం పొలంలో నాటడం ద్వారా కోటి రూపాయలు ఆదాయం సంపాదించవచ్చు. ఇది ఔషధ వృక్షమే కాకుండా దాని కర్రలు కూడా తినదగినవిగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఈ చెట్లు వాటి చుట్టూ ఉన్న నేలలో నత్రజని, భాస్వరంను కలిపి పంట దిగుబడిని పెంచుతాయి.
మహోగని చెట్టు: ఈ కలపకు నీటి నిరోధకత ఉంది. మహోగని చెక్కపై నీరు నిలవదు. దీనివల్లే ఇది ఖరీదైన చెట్టుగా మారింది. దాంతో తయారు చేసిన ఫర్నిచర్ ధర కూడా అంతే ఖరీదుగా ఉంటుంది. ప్రస్తుతం కిలో రూ.2వేల నుంచి 2500 రూపాయల వరకు మహోగని కలప ఉంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications