సెల్ఫీల కోసం దారుణంగా కొట్టుకున్న యువతులు.. వీడియో వైరల్...
ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్స్.. ఆ ఫోన్స్‌తో ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు మాత్రం తెగ దిగేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సరే ఫోన్ తీసి సెల్ఫీ దిగడం, ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం ఇది పరిపాటిగా మారిపోయింది. అయితే, ఇలాంటి సెల్ఫీలు కొన్నిసార్లు శృతిమించి అపశ్రుతిపాలవుతున్నారు చాలామంది. సెల్ఫీల విషయంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదీ నిజం..ఇలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది.
సెల్ఫీల కోసం కొందరు యువతుల గొడవపడ్డారు. ఈ ఘటన తాజాగా గుంటూరులోని గాంధీ పార్కులో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కొంతమంది యువతులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. సెల్ఫీలు తీసుకునేందుకు నేను ముందంటూ నేను ముందుంటు ఎగబడ్డారు. ఇంతకీ విషయం ఏమీటంటే, గుంటూరు నగరంలో ఇటీవల కొత్తగా గాంధీ పార్క్‌ను ప్రారంభించారు. అక్కడ ప్రత్యేకంగా సెల్ఫీల కోసం ఓ లొకేషన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో కొందరు యువతులు, మహిళలు సెల్ఫీలు పోటీపడ్డారు. చిన్న గొడవగా మారిన ఈ సెల్ఫీల వివాదం కాస్త ఇరువర్గాల వారు జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థాయి వరకూ వచ్చింది. ఈ వివాదంలో యువతులు, మహిళలు ఏకంగా జుట్లు పట్టుకుని మరీ దారుణంగా కొట్టుకున్నారు. అయితే, అక్కడే ఉన్నవారు కొందరు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు మాత్రం గొడవలో తగ్గేదేలే అంటూ కొట్టుకున్నారు.
Gandhi Park, Guntur.
— Saran Bhuma (@telugodikeka) November 27, 2023
Ladies Fighting...we are so developed.
😂😂😂 pic.twitter.com/fgqfWOef4k
గొడవలో ఒకరిని ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు...
వీరి మధ్య వివాదం కాస్త శృతిమించి ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. సెల్ఫీల కోసం ఇలా యువతులు గొడవకు దిగడంతో అక్కడే ఉన్నా స్థానికులంతా నోరేళ్లబెట్టి మరీ చూస్తున్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా అక్కడే గొడవను చూస్తున్న ఓ వ్యక్తి మాత్రం ఈ గొడవనంతా తన మొబైల్ రికార్డు చేసి, సోషల్‌మీడియాలో పెట్టాడు. దాంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన కొందరు నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు. కొందరేమో.. సెల్పీ కోసం గొడవలేంట్రా బాబు.. అంటే.. మరికొందరేమో, ఇంత వైలంట్‌గా ఉన్నారేంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications