పసుపు రంగు డ్రెస్ లో వైఎస్ భారతి.. షర్మిల చీరపై జగన్ వ్యాఖ్యల బూమరాంగ్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిల పసుపు రంగు చీర కట్టుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లడం పైన తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక షర్మిల చీర కట్టుకోవడం పైన వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి.

చెల్లి చీరపై అన్న వ్యాఖ్యలు .. జగన్ పై విమర్శలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ పసుపు చీర కట్టుకొని వాళ్ల ఇళ్లకు వెళ్లి మోకరిల్లే మీరు వైయస్సార్ వారసులా లేక చంద్రబాబు వారసులా అంటూ ప్రశ్నించారు. ఇక చెల్లి కట్టుకున్న చీర గురించి ఒక బహిరంగ సభలో అన్న మాట్లాడిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

YS Bharathi in a yellow dress YS Jagan comments on YS Sharmila saree went boomerang

సీరియస్ గా రియాక్ట్ అయిన వైఎస్ షర్మిల
జగన్ తన సొంత చెల్లెలు గురించి మాట్లాడుతున్నాను అన్న విషయం మర్చిపోయి ఈ తరహాలో చెల్లి చీర రంగు గురించి మాట్లాడటం కంటే దిగజారుడుతనం ఏముంటుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వేలమంది ఉన్న సభలో చెల్లెలు కట్టుకున్న బట్టల గురించి ఓ అన్న ఎక్కడైనా ప్రస్తావిస్తారా అంటూ ప్రశ్నించారు.

పసుపు రంగు చీర కట్టుకుంటే ఏంటి?
ఇంగితం కూడా లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, అసలు సంస్కారమే లేదంటూ వైయస్ షర్మిల దుయ్యబట్టారు. తాను పసుపు రంగు చీర కట్టుకున్నానని అయితే చంద్రబాబుకు పసుపు రంగు మీద ఏమైనా పేటెంట్ హక్కు ఉందా అంటూ ప్రశ్నించిన షర్మిల, మొన్నటి వరకు సాక్షి ఛానల్ కూడా పసుపు రంగులోనే ఉండేదని, పసుపు రంగు మంగళకరమైన రంగని వైయస్సార్ అంటూ ఉండేవారని ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చారు.

జగన్ వ్యాఖ్యలు బూమరాంగ్
వైఎస్ షర్మిల ను టార్గెట్ చేయడానికి జగన్ చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యి ఇప్పుడు జగన్ కే రివర్స్ తగులుతున్నాయి. వైఎస్ షర్మిల పసుపు రంగు బట్టలు వేసుకుంటే కామెంట్ చేసిన జగన్ కు ఇప్పుడు జగన్ సతీమణి వైయస్ భారతి పసుపు రంగు డ్రెస్ వేసుకున్న బట్టలను పెట్టి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు నెటిజన్లు.

భారతి పసుపు డ్రెస్ పై జగన్ ఏమంటారు?
పసుపు రంగు చీర కట్టుకుంటే చెల్లిని తప్పు పట్టిన అన్న జగన్, ఇప్పుడు పసుపు రంగు డ్రెస్ వేసుకున్న భారతి విషయంలో ఏమంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. పసుపు రంగు బట్టలు భారతి వేసుకుంది కాబట్టి భారతి కూడా చంద్రబాబు వారసురాలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా బట్టల పై జగన్ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యి మళ్లీ ఆయనకే తగలడం ప్రధానంగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+