వైసీపీలో బాధ్యతల మార్పు - జగన్ కీలక నియామకాలు..!!

ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీని సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నేతలలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా పార్టీలో ప్రధాన కార్యదర్శులు ...ముఖ్య విభాగాలకు బాధ్యులను ప్రకటించారు. దువ్వాడ శ్రీను పైన వేటు వేసారు. ఇక, ఇప్పుడ తాజాగా పార్టీకి చెందిన 15 అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షలను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కీలక పదవుల్లోనూ మార్పులు జరగనున్నాయి.

తాజా నియామకాలు
వైసీపీకి అనుబంధంగా ఉన్న మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను జగన్ నియమించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నియమితులయ్యారు. అదే విధంగా రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్‌ నాగిరెడ్డికే మరోసారి జగన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుని నియమించారు. రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషాకు బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్‌ నియమితులయ్యారు.

YS Jagan Appointed new incharges for YSRCP affliated wings as party reshuffle

జగన్ కసరత్తు
రాష్ట్ర వాలంటీర్‌ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్‌ కు జగన్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర వైయ‌స్ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా గౌతంరెడ్డి వ్యవహరించనున్నారు. రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డిని నియమించారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష పేరును జగన్ ప్రకటించారు. రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునిల్‌, రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజు. రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా నారాయణమూర్తిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

అధ్యక్షుల మార్పు
ఇక, రాష్ట్ర వైయ‌స్ఆర్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు.. రామచంద్రారెడ్డి (ప్రైవేట్‌ స్కూళ్లు) , చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్‌ స్కూళ్లు) రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమిస్తూ జగన్ తన నిర్ణయం ప్రకటించారు. ఇక..పార్టీలో ముఖ్య స్థానాల్లో ఉన్న నేతల బాధ్యతల్లోనూ మార్పులు జరగనున్నాయి. ఆ తరువాత జిల్లా అధ్యక్షుల మార్పు దిశగా జగన్ కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారం కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల మార్పు పైన జగన్ నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+