అల్లు అర్జున్ అరెస్టు ఖండించిన జగన్- రేవంత్ సర్కార్ పై ఫైర్..!
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి రెండు వారాల రిమాండ్ కు పంపారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదన్నారు.. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదన్నారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024












Click it and Unblock the Notifications