చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అందుకే భయం- వెల్లడించిన జగన్

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గల కోపానికి గల కారణాలను విశ్లేషించారు వైఎస్ జగన్. పుంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై జరిగిన దాడి గురించి- విలేకరుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు దీని గురించి వివరించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబుది ఒకే జిల్లా. ఇద్దరు నాయకులు చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లే. ఒకప్పుడు క్లాస్ మేట్స్ కూడా. ఇద్దరూ కలిసి చదువుకున్నారనే విషయం తెలిసిందే. అంత స్నేహంగా ఉండే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- చంద్రబాబు మధ్య ఎందుకు గొడవలొచ్చాయనే విషయంపై జగన్ మాట్లాడారు.

YS Jagan explains why CM Chandrababu is angry with Peddireddy Ramachandra Reddy

కాలేజీలో చదువుకునేటప్పుడు పెద్దిరెడ్డి.. చంద్రబాబు నాయుడిని కొట్టారట అని జగన్ చెప్పారు. ఆ కోపాన్ని చంద్రబాబు ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాడని, జీర్ణించుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డిని తొక్కాలని చంద్రబాబు ఎప్పుడూ విపరీతంగా ప్రయత్నం చేస్తుంటాడని వైఎస్ జగన్ అన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చంద్రబాబుకు పీకలదాకా కోపం ఉంటుందని జగన్ అన్నారు. తనను కాలేజీ రోజుల్లో కొట్టాడనే కోపంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని తొక్కేయాలని, వాళ్లను నాశనం చేయాలని, అవకాశం దొరికినప్పుడల్లా బండ వేయాలని చూస్తుంటాడని పేర్కొన్నారు జగన్.

ఆ కక్షతోనే పెద్దిరెడ్డి గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎక్కడికి వెళ్లినా.. దాడులు చేయాలని చంద్రబాబు చూస్తుంటాడని జగన్ ఆరోపించారు. వాళ్ల సొంత నియోజకవర్గం పుంగనూరులో మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రెడ్డెప్ప రెడ్డి కారును టీడీపీ నాయకులు తగులబెట్టారని, మిథున్ రెడ్డి కారును ధ్వంసం చేశారని జగన్ చెప్పారు. టీడీపీ నాయకులే దాడులు చేసి, మళ్లీ మిథున్ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డిపై ఎదుకు కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. చంద్రబాబు రాజకీయం ఇలాగే ఉంటుందని అన్నారు.

నిజానికి- పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉందని జగన్ అన్నారు. అందుకే- రామచంద్రారెడ్డి ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మూడుసార్లు లోక్‌‌సభ ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పారు. మంచిపేరు ఉండటం వల్లే వాళ్లు ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వస్తోన్నారని జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+