ఇదీ జగన్ స్ట్రెంగ్త్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీలో పలు చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పలు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో కేక్ లను కట్ చేశారు. వైఎస్ఆర్సీపీ జెండాలను ఎగురవేశారు. సందడి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రులు పవన్ కల్యాణ్, మల్లు భట్టి విక్రమార్క, భారతీయ జనతా పార్టీ నాయకుడు కే రవిచంద్రారెడ్డి.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసిన వారలో ఉన్నారు. నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని వారందరూ ఆకాంక్షించారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తన అన్నకు బర్త్ డే విషెస్ తెలిపారు.

తన పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ తెలిపిన అందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతల తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. తన పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలకు ఉప్పొంగిపోయానని అన్నారు. వాళ్లందరి మద్దతే తన ప్రధాన బలమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ షర్మిలకు జగన్ ప్రత్యేకంగా రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ అమ్మా అని రిప్లై పోస్ట్ పెట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోనూ జగన్ పుట్టినరోజు వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాల నుంచి గ్రామ స్థాయి వరకు ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షా కేంద్రాలు, అన్నదానం, పేదలకు దుస్తులు, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఈ క్రమంలో ఎక్స్‌లో టాప్ ట్రెండింగ్‌గా 'హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్' నిలిచారు. దీంతో పాటు ఇటు మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోనూ పోస్టులతో సోషల్ మీడియాలో గ్లోబల్ ట్రెండింగ్‌లోకి అయ్యాయి. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఎడిటింగ్ వీడియోలు.. ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎక్స్‌లో '#HappyBirthdayYSJagan', '#HBDYSJagan', 'Jagan Anna' వంటి హ్యాష్‌ట్యాగ్‌లు గ్లోబల్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.












Click it and Unblock the Notifications