Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దివ్యాంగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-ఉద్యోగాలు, ప్రమోషన్లలో 4 శాతం రిజర్వేషన్ !

ఏపీలో దివ్యాంగులకు వైసీపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు వివిధ సామాజిక పథకాలను వర్తింపచేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఏపీపీఎస్సీ స్ధాయి ఉద్యోగాల్లో సైతం ఈ రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా దీని విధివిధానాలతో ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో దివ్యాంగులకు ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఏపీపీఎస్సీ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 77 ప్రకారం ఇక నుండి ఏపీపీఎస్సీ ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లకు సంబంధించి దివ్యాంగుల కోసం 4 శాతాన్ని రిజర్వేషన్‌ను అమలు చేయబోతోంది.

ys jagan government good news to differently-abled-4 percent reservation in appsc jobs, promotions

అలాగే దివ్యాంగులకు ఇచ్చే ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో విధివిధానాలను కూడా ఈ జీవోలో పేర్కొన్నారు. దీని ప్రకారం చెవిటి వారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగులను ఈ జాబితాలో ప్రభుత్వం చేర్చింది. కానీ ఈ రిజర్వేషన్ లోనూ కొన్ని నిబంధనలు విధించారు. దీంతో ఎప్పటిలాగే కొందరు అనర్హులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీపీఎస్సీ అమలు చేసే ఈ రిజర్వేషన్ల లో ఉద్యోగాలకు సంబంధించి అర్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులు అయి ఉండాలని ప్రభుత్వం షరతు పెట్టింది. ఈ మేరకు దివ్యాంగులు కమిషన్ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఇకపై ప్రకటించే ఉద్యోగాల నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+