తండ్రి, జగన్ స్వార్జితంలో షర్మిలకు ఇచ్చిన ఆస్తులు లెక్కలు..!!
వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. రాజకీయంగా జగన్ - షర్మిల మద్య ఆస్తి పంపకాల పంచాయితీ రాజకీయ రచ్చగా మారింది. ఈ అంశం ట్రిబ్యునల్ కు చేరింది. అయితే, షర్మిలకు తండ్రి నుంచి వారసత్వ ఆస్తులతో పాటుగా జగన్ తన స్వార్జితం నుంచి సోదరికి ఇచ్చిన ఆస్తుల లెక్కలను వైసీపీ బయట పెట్టింది. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల విషయంలో... షర్మిల మార్పులుచేర్పులు చేయడంతో వివాదం మొదలైందని చెప్పుకొచ్చారు.
ఆస్తుల పంపకం
జగన్ - షర్మిల మధ్య రచ్చగా మారిన ఆస్తుల అంశం పైన వైసీపీ ముఖ్య నేత పేర్ని నాని స్పందించారు. షర్మిలకు తన తండ్రి లో వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటుగా .. జగన్ తన స్వార్జితంలో ఇచ్చిన ఆస్తుల లెక్కలను వెల్లడించారు. అసలు ఈ వివాదం ఏంటనేది స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. వైఎస్ మరణానికి ముందే ఆయన ఆస్తులను పంపకాలు చేసారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో 280గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం ఇచ్చారని పేర్ని నాని వివరించారు.

షర్మిలకు దక్కినవి
వీటితో పాటుగా 15మెగావాట్ల సండూర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టుల లైసెన్సులు, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్ - యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు దక్కాయని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అదే విధంగా భారతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, మీడియా వ్యాపారసంస్థలన్నీ జగన్ స్వార్జితంగా పేర్ని నాని వెల్లడించారు. 2019 లో జగన్ తన స్వార్జితపు ఆస్తిలోనూ వాటాలను షర్మిలకు ప్రేమతోనే రాసిచ్చారని..ఆ వివరాలను బయట పెట్టారు.
షర్మిలకు జగన్ ఇచ్చిన వాటాలు
జగన్ తన తల్లి, చెల్లికి ఈడీ చ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల్లో వాళ్లకు వాటా ఇస్తానంటూ ఒప్పందం రాసుకున్నారని ర్ని వివరించారు. భారతి సిమెంట్స్‌లో 40 శాతం, మీడియా సంస్థలో 40 శాతం, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో 100 శాతం వాటా ఇస్తానంటూ జగన్ ఒప్పందం రాసారని చెప్పారు. ఈడీ వివాదం పూర్తయిన తరువాత ఒప్పందంలో రాసుకున్న విధంగా ఆస్తులు ఇస్తానని జగన్ ఒప్పదం సారాంశంగా వెల్లడించారు. అయితే, షర్మిల అనూహ్యంగా షేర్ సర్టిఫికెట్లు పోయాయని చెప్పి కొత్త షేర్లను విజయలక్ష్మి పేరు మీద మార్చేసి డైరెక్టర్లను షర్మిల మార్చి వేయటంతోనే వివాదం మొదలైందని పేర్ని నాని వివరించారు.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications