జగన్ చిన్న పిల్లాడు, సిఎం పదవి కోసమే ఇలా: డిఎస్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చిన్న పిల్లవాడిగా అభివర్ణించారు. జగన్ చిన్న పిల్లవాడని, లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (ఎపిజెఎఫ్) ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన బుధవారంనాడు మాట్లాడారు.

ముఖ్యమంత్రిని కావాలనే కోరికనే జగన్ చేత అలా చేయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రాష్ట్రాల విభజనకు బిజెపి సహా ఇతర పార్టీల నాయకులు సహకరిస్తే ఇక్కడ తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

D Srinivas

తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది తామేనని ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే దక్కుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం తాము సత్యంగా ఉద్యమించామని, పార్లమెంటు సభ్యులు పార్లమెంటును అడ్డుకోవడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.

విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాయడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసులో పార్టీని విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావే చెప్పారని, ఇప్పుడు విలీనం చేయబోమని అంటున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ గంటకో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ తెచ్చిన ఘనత తమదేనని చెప్పుకోవడానికి కూడా తెరాస నాయకులకు దమ్ము లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+