Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామాలు చేద్దాం, ఉప ఎన్నికలకు వెళ్దాం - జగన్ సంచలనం..!!

మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను తమ కు అనుకూలంగా మలచుకునే వ్యూహాలను అమలు చేస్తున్నారు. దసరా తరువాత రాజకీయంగా కీలక కార్యాచరణ అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు జగన్ అండ్ టీం గైర్హాజరు అయింది. అటు మెడికల్ కాలేజీల పైన పోరాటం తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రాజీనామాలు.. ఉప ఎన్నికల పైన జగన్ ఆలోచన చేస్తున్నారు. కీలక ప్రకటన దిశగా సమాయత్తం అవుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో తమకు ప్రతిపక్ష హోదా లేకపోయినా.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సమావేశాల కు హాజరయ్యేందుకు సిద్దమని స్పష్టం చేసారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సమావేశాలకు హాజరు కావాలని భావిస్తే తాను ఆపనని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలతో పాటుగా సభకు వెళ్లేందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్దంగా ఉంటే.. అందరూ కలిసి వెళ్లాలని సూచించారు.

YS Jagan made interesting comments on party MLA s Resignation and By polls

ఇదే సమయంలో సభకు రాని ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు పదే పదే చేస్తున్న ప్రస్తావన పైన జగన్ సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేస్తే వేసుకోనివ్వాలని జగన్ వ్యాఖ్యానించారు. ఆయన అన్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్దామని జగన్ తేల్చి చెప్పారు.

తాము ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని చెప్పలేదని, తాము ప్రజా మస్యలను ప్రస్తావించడానికి తగిన సమయం ఇస్తామని అధికారపార్టీ నుంచి స్పష్టమైన హామీ రాలేదన్నారు. సభ్యుల బలం చూపెట్టి చర్చలను పక్కదారి పట్టిస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు.
ఎవరికైనా అసెంబ్లీకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని, తనకు అభ్యంతరం లేదని,వెళ్లి అభాసుపాలు కావద్దనే తన అభిప్రాయమని జగన్ అన్నారు. అదే సమయంలో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తాజాగా నాలుగు కాలేజీల కోసం పీపీపీ విధానంలో టెండర్లు ఆహ్వానించింది.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు పిలుపు ఇచ్చింది. కాగా, టెండర్లకు వచ్చే స్పందన.. ప్రభుత్వ భవిష్యత్ అడుగులకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి ధర్నాకు జగన్ సిద్దం అవుతున్నారు. చివరి అస్త్రంగా ఎమ్మెల్యేల రాజీనామాలు ఈ అంశంలో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జగన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో, దసరా తరువాత రాజీనామాల విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+