జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!!

మావిగన్. ఇప్పుడు ఈ పేరు చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అమరావతి రాజధానిగా పార్లమెంట్ లో చటబద్దత వేళ మాజీ సీఎం చేసిన కొత్త ప్రతిపాదన మావిగన్. అమరావతికి ప్లాన్ బీ గా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే, మావిగన్ పేరు పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగ్గా.. వైసీపీ నేతలు మాత్రం భవిష్యత్ లో ఈ ప్రతిపాదన విలువ అర్దం అవుతుందని చెబుతున్నారు. కాగా.. జగన్ కు ఈ మావిగన్ సలహా ఇచ్చిన నేత.. అసలు లక్ష్యం పై కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

అమరావతి కి పార్లమెంట్ లో చట్ట బద్దత కోసం బిల్లు ప్రతిపాదన వేళ మాజీ సీఎం జగన్ రాజధాని పై స్పందించారు. తన హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన వెనుక కారణాలను మీడియా ద్వారా వెల్లడించారు. అమరావతిలో లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పటం పైన తన అభిప్రాయం వ్యక్తం చేసారు. అమరావతికి వ్యతిరేకం కాదని చెబుతూనే.. కేవలం మౌలిక వసతుల కల్పన కోసమే ఎకరాలకు రూ 2 కోట్లు చొప్పున రెండు లక్షల కోట్లు అవసరం అవుతాయి అని గతంలో ప్రభుత్వం చెప్పిన లెక్కలను వివరించారు. ఇంత మొత్తం ఖర్చు చేసి రాజధాని నిర్మాణం చేస్తే.. ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఆర్దికంగా ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు. దీంతో.. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు వరకూ కొత్త రాజధానిని ప్రకటించాలని... దానికి MAVIGUN(మావిగన్) అని పేరు పెట్టాలని సూచించారు. మచిలీపట్నం (MA)- విజయవాడ (Vi)- గుంటూరు (GUN) పేర్లతో మావిగన్ పేరు పెట్టాలని.. తన పేరు వస్తుందనిపిస్తే మరో పేరు పెట్టాలని జగన్ సూచించారు.

ys-jagan-mavigun-plan-sparks-new-row-in-political-circles-ministers-strongly-criticized-recent-rema

మావిగన్ పై జగన్ అసలు ఆలోచన

మావిగన్ అయితే బాగుండదనుకుంటే, వేరే పేరు పెట్టి 110 కి.మీ క్యాపిటల్ కారిడార్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని సూచించారు. కాగా.. అమరావతి బిల్లు ఆమోదం తో.. మావిగన్ ప్రతిపాదన పైన కూటమి నేతలు మండిపడ్డారు. జగన్ ను టార్గెట్ చేసారు. సోషల్ మీడియాలో నూ పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసారు. వైసీపీ నేతలు మాత్రం.. రానున్న రోజుల్లో జగన్ చెప్పిన లెక్కలు.. మావిగన్ ప్రతిపాదన వెనుక వాస్తవాలు అర్దం అవుతాయని చెబుతున్నారు. కాగా.. జగన్ కు పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఈ మావిగన్ ప్రతిపాదన అందించినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల సమయంలోనూ చెవిరెడ్డి తన సర్వే సంస్థ ద్వారా అభ్యర్ధుల మార్పు.. ఎమ్మెల్యేలు మరో స్థానానికి బదిలీ.. గెలిచే సీట్ల పైన జగన్ కు నివేదికలు ఇచ్చారు. అంతకు ముందు తెలంగాణలో కేసీఆర్ కు ఇలాంటి లెక్కలే అందించారు. అవి వాస్తవ రూపం దాల్చ లేదు. కాగా.. 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి లెక్కలు నిజం కాదని తేలినా.. ఇప్పుడు జగన్ అదే చెవిరెడ్డి ఇచ్చిన ప్రతిపాదనల మేరకు మావిగన్ ప్రతిపాదన చేయటం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+