రూటు మార్చిన జగన్ - పవన్ "సక్సెస్" పై ట్రిగ్గర్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ రాజకీయంగా తన రూటు మార్చారు. ఎన్నికల్లో ఓటమి తరువాత గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ, వ్యవహార శైలిలో దిద్దుబాటు ప్రారంభించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ సక్సెస్ కారణాల పైన జగన్ గురి పెట్టారు. వరుస నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. జగన్ లో వచ్చిన మార్పు.. తాజా ప్రకటనల పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ఈ నిర్ణయాలు జగన్ కు కలిసి వస్తాయా .. ఏం జరుగుతోంది.
జగన్ లో మార్పు
ఎన్నికల్లో పరాజయం తరువాత అధికారంలో ఉన్న సమయంలో చేసిన పొరపాట్లు ఎంత భారీ నష్టం చేసాయో జగన్ గుర్తించారు. పార్టీ నేతలతో వరుస సమీక్షలో అనేక అంశాలు బయటకు వచ్చాయి. అదే సమయంలో పవన్ సక్సెస్ కారణాల పైన చర్చకు వచ్చింది. దీంతో, జగన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు సమయం కేటాయిస్తున్నారు. పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజల మధ్యకు వెళ్తూ సీఎం కాకముందు జగన్ ఎలా ఉండేవారో..అదే రీతిన ఇప్పుడు కనిపించే ప్రయత్నం చేస్తూ తాను మారాననే సంకేతాలు ఇస్తున్నారు.

పవన్ కు పోటీగా
జగన్ తాజా పర్యటనల సమయంలోనే వరుసగా ఆర్దిక పరంగా పార్టీ తరపున సాయం ప్రకటిస్తున్నారు. గతంలో ఈ తరహాలో ఎప్పుడూ జగన్ ప్రకటనలు చేయలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో జనసేనాని పవన్ కౌలు రైతుల కోసం తన సొంత నిధుల నుంచి సాయం చేసారు. ఆ నిర్ణయం ప్రజల్లో పవన్ పైన సానుకూలత పెరగటానికి దోహదం చేసింది. విజయవాడ వరదలతో పాటుగా విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన కుటుంబాలకు పవన్ వ్యక్తిగతంగా ఆర్దిక సాయం ప్రకటించారు. జగన్ సైతం విజయవాడ వరద బాధితుల కోసం పార్టీ నుంచి కోటి రూపాయాల మేర సాయం చేసేందుకు నిర్ణయించారు.

వరుస ప్రకటనలు
ఇక, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన దాడులు, అత్యాచార బాధిత కుటుంబాలకు రూ 10 లక్షల చొప్పున తమ పార్టీ నుంచి ఆర్దిక సాయం చేస్తామని జగన్ ప్రకటన చేసారు. తాజాగా విజయనగరం జిల్లాలో డయేరియా కారణంగా మరణించిన కుటుంబాలకు పవన్ వ్యక్తిగతంగా రూ లక్ష ప్రకటిస్తే.. జగన్ తన పార్టీ నుంచి రూ రెండు లక్షల చొప్పున సాయం ప్రకటించారు. దీని ద్వారా పవన్ తన సొంత నిధులు సాయంగా ప్రకటించటం ద్వారా పెరుగుతున్న ఇమేజ్ పైన జగన్ గురి పెట్టినట్లు కనిపిస్తోంది. మరి..జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు.. చేస్తున్న ఈ సాయం రాజకీయంగా కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications