ys jagan ys jagan mohan reddy pylon praja sankalpa yatra srikakulam ichapuram sharmila ys rajasekhar reddy ysr congress ycp వైయస్ జగన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పైలాన్ ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం ఇచ్చాపురం షర్మిల వైయస్ రాజశేఖర రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ వైసీపీ
ఇచ్చాఫురంలో పైలాన్ ఆవిష్కరణ: భానుచందర్‌ను పార్టీలోకి ఆహ్వానించిన జగన్

ఇచ్చాపురం/శ్రీకాకుళం/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర బుధవారం నాడు ముగిసింది. 6 నవంబర్ 2017లో ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ పాదయాత్ర 9 జనవరి 2018న ఇచ్ఛాపురంలో ముగిసింది.
జగన్ పాదయాత్ర: ఇచ్ఛాపురంలోని వైసీపీ పైలాన్ అద్భుతం, ఎలా ఉందంటే?

పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో మాట్లాడనున్నారు. విజయస్థూపం పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. మూడంతస్తులుగా స్థూపం దీనిని నిర్మించారు. పైలాన్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి కిలో మీటర్ల మేర వైసీపీ అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. జగన్ రాకముందే ప్రాంగణం నిండిపోయింది.
వైసీపీలో చేరిన భానుచందర్
ప్రముఖ సినీ నటుడు భానుచందర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాదయాత్ర చివరి రోజు వైసీపీ అధినేతను కలిశారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భానుచందర్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. పార్టీ అప్పగించే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.