పవన్ పై జగన్ అల్లు అస్త్రం- తెర వెనుక, "కాపు" కాస్తారా..!!
ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అల్లు అర్జున్ కు వైసీపీ మద్దతుగా నిలిచింది. పుష్ఫ -2 విడుదలకు ముందు నుంచి సినిమాకు మద్దతుగా వైసీపీ కేడర్ ముందుకొచ్చింది. విడుదల సమ యంలోనూ పుష్ఫ బ్యానర్ల పై జగన్ ఫొటోలు కనిపించాయి. సినిమా హీరోల విషయంలో ఏనాడు స్పందించని జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ సరి కాదంటూ ట్వీట్ చేసారు. జగన్ ఈ స్పందన వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. మరి..జగన్ అనుకున్నట్లుగా ఫలితం కనిపిస్తుందా...
వైసీపీ మద్దతుతో
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరో. కానీ, ఎన్నికల వేళ వైసీపీ నేత..తన స్నేహితుడు అయిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్ రావటంతో ఒక్క సారిగా బన్నీ అంశం కొత్త టర్న్ తీసుకుంది. పవన్ కల్యాణ్ జనసేన కూటమిలో భాగస్వామిగా ఉంది. నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉన్నారు. అక్కడ వైసీపీ అభ్యర్ధి ఇంటికి వెళ్లటం ద్వారా అల్లు అర్జున్ జనసేన శ్రేణులకు.. పవన్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు. అదే సమయం నుంచి వైసీపీ కేడర్ అల్లు అర్జున్ కు మద్దతుగా నిలుస్తోంది. పుష్ప -2 విడుదల సమయంలోనూ వైసీపీ కేడర్ అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టింగ్స్ తో హంగామా చేసారు. పుష్ప-2 సక్సెస్ ను తమ సక్సెస్ గా భావించారు.

అల్లు అర్జున్ కోసం
ఇక, అల్లు అర్జున్ అరెస్ట్ వేళ వైసీపీ ఎంపీ.. ఒక విధంగా చెప్పాలంటే జగన్ లీగల్ టీం కీలకంగా పని చేసింది. న్యాయవాదులుగా వారు అల్లు అర్జున్ కేసులను టేకప్ చేసినా.. జగన్ తో వారికి ఉన్న సంబంధాలు ప్రధాన చర్చగా మారాయి. అల్లు అర్జున్ కు బెయిల్ రావటంలో కీలకంగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి వైసీపీ ఎంపీ కావటం మరో కారణం. ఇక.. అల్లు అర్జున్ అరెస్ట్ ను జగన్ తప్పు బట్టారు. అల్లు అర్జున్ - పవన్ మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం తో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలవటంతో జగన్ కొత్త వ్యూహానికి తెర తీసారు. అయితే, అల్లు అర్జున్ కోసం మెగా బ్రదర్స్ రావటం.. ఆ తరువాత చిరంజీవి, నాగబాబు ఇళ్లకు అల్లు అర్జున్ వెళ్లటంతో ఈ గ్యాప్ ఒక ఉండదనే అంచనాలు ఉన్నాయి.
పక్కా వ్యూహం
ఇక..సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కు ఏపీలో ఫ్యాన్ ఫాలోయింగ్ రాజకీయంగానూ జనసేనకు బలంగా మారింది. ఇక.. ఏపీలో రాజకీయం - సినిమా రెండు సామాజిక కోణంలోనూ కీలకంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో మెజార్టీ కాపు వర్గం పవన్ కు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్.. పవన్ స్పందించకపోవటంతో కాపు వర్గం లోని కొందరు అసంతృప్తితో ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. దీంతో, కాపు వర్గం.. బన్నీ ఫ్యాన్స్ లక్ష్యంగా వైసీపీ అల్లు అర్జున్ విషయంలో కొత్త ఎత్తుగడలు అమలు చేసింది. మరి.. జగన్ వ్యూహం ఏ మేర సక్సెస్ అవుతుందనేది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలతో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications