విశాఖలో జగన్, ఆంక్షలు..రూట్ ఛేంజ్ - వైసీపీ ప్లాన్ బీ అమలు..!!

మాజీ సీఎం జగన్ అనకాపల్లి పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ పర్యటన వేళ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఎక్కడ షరతులు ఉల్లంఘన జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అటు వైసీపీ నేతలు జగన్ పర్యటన వేళ భారీ గా జన సమీకరణ చేస్తున్నారు. జగన్ పర్యటన వేళ ఉత్కంఠ నెలకొంది. చివరి నిమిషంలో మారుతున్న నిర్ణయాలతో.. వైసీపీ వ్యూహం మార్చింది. జగన్ పర్యటన ముందుగా నిర్ణయించిన ప్రకారమే సాగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ నర్సీపట్నం పర్యటన వేళ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పోలీసు శాఖ నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్తే అనుమతి రద్దు అవుతుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. వాహన శ్రేణిని దారిలో ఎక్కువ సార్లు ఆపడం, భారీ జన సమీకరణ వంటివి చేస్తే నిబంధనల్ని ఉల్లంఘిస్తే రాజకీయ హోదా, పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ys-jagan-narispatnam-tour-creates-new-tension-amid-police-restrictions

ఈ విషయంలో పోలీసులు జీరో టాలరెన్స్‌ విధానాన్ని అనుసరిస్తారని వెల్లడించారు. జగన్‌ ప్రయాణించే మార్గంలో ముందు, వెనక ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలు, భారీ జన సమీకరణ చేయడం నిషేధించామని చెప్పారు. కార్యకర్తలను, జనాన్ని సమీకరించడం, ట్రాఫిక్‌ నిరోధించడానికి ప్రయత్నించడం వంటివి చట్ట ఉల్లంఘనలుగా పరిగణిస్తామని వెల్లడించారు.

అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని డీజీపీ స్పష్టం చేసారు. ప్రజల రక్షణ కోసమే పోలీసు ఏర్పాట్లు అని ఆయన అన్నారు. జగన్ పర్యటనకు అనకాపల్లి పోలీసులు 18 నిబంధనలతో అనుమతి ఇచ్చారు. ఆయన కాన్వాయ్‌లో 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఇచ్చిన రూట్‌లోనే వెళ్లాలి తప్ప ఇతర మార్గాల్లో వెళ్లకూడదని పేర్కొన్నారు. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాఫ్టర్​లో వచ్చేందుకు ఆయనకు అనుమతి ఇస్తున్నమని చెప్పారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం జగన్ పర్యటన వేళ భారీ జన సమీకరణ చేస్తున్నారు. జగన్ కోసం వచ్చే జనాన్ని ఆపలేరని చెబుతున్నారు. దీంతో.. జగన్ పర్యటన వేళ చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+