వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రజా సంకల్పయాత్ర: సంస్ఘాగత మార్పులు, బాబుకు వైసీపీ చెక్ ఇలా

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను పురస్కరించుకొని రూట్‌మ్యాప్‌పై విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తున్నారు. పాదయాత్ర తొలి రెండు మాసాల్లో కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర జరిగేలా ఆ పార్టీ నాయ

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను పురస్కరించుకొని రూట్‌మ్యాప్‌పై విస్తృతస్థాయి సమావేశంలో చర్చిస్తున్నారు. పాదయాత్ర తొలి రెండు మాసాల్లో కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర జరిగేలా ఆ పార్టీ నాయకత్వం రూట్‌మ్యాప్‌ను తయారు చేసింది.రాయలసీమలో తమకు పట్టున్న విషయాన్ని మరోసారి నిరూపించుకొనేందుకు ఆ పార్టీ ఈ పాదయాత్రను ఎంచుకొంటుంది.నవంబర్ 4వ, తేదిన జగన్ తిరుపతికి వెళ్ళనున్నారు.ఈ యాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా పేరు పెట్టారు

Recommended Video

అసెంబ్లీ సెషన్స్ బహిష్కరణకు వైసీపీ నిర్ణయం | Oneindia Telugu

నవంబర్ 6వ, తేది నుండి వైసీపీ చీఫ్ జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు.

అసెంబ్లీ సెషన్స్ బహిష్కరణకు వైసీపీ నిర్ణయం: 21 మంది ఎమ్మెల్యేలపై వేటుకు డిమాండ్ అసెంబ్లీ సెషన్స్ బహిష్కరణకు వైసీపీ నిర్ణయం: 21 మంది ఎమ్మెల్యేలపై వేటుకు డిమాండ్

దీంతో పాటుగా తాము అధికారంలోకి వస్తే నవరత్నా హమీలను అమలు చేయనున్నట్టు ఆ పార్టీ ప్రచారం చేయనుంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నాడు నిర్వహించారు.

.పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో పాటు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై చర్చించారు.

పాదయాత్రకు ప్రజా సంకల్పయాత్రగా పేరు

పాదయాత్రకు ప్రజా సంకల్పయాత్రగా పేరు

నవంబర్ 6వ, తేది నుండి ప్రారంభించే యాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా వైసీపీ నామకరణం చేసింది. ప్రతి రోజూ 14 కిలోమీటర్ల పాటు వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఉదయం పూట 7 కి.మీ, సాయంత్రం 7 కి.మీ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారని వైసీపీ వర్గాలు ప్రకటించాయి. ప్రతి రోజూ 14 కి.మీ పాటు యాత్ర సాగేలా రూట్‌మ్యాప్‌ను సిద్దం చేశారు.

పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై జగన్ చర్చ

పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై జగన్ చర్చ

నవంబర్ 8వ, తేది నుండి జరిగే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే పాదయాత్ర రూట్‌మ్యాప్ ఎలా ఉండాలనే దానిపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. పాదయాత్రలో ఏ అంశాలు ప్రస్తావించాలనే దానిపై కూడ చర్చ జరిగింది. మరో వైపు స్థానికంగా ఉన్న పరిస్థితులను కూడ పాదయాత్ర సందర్భంగా ప్రస్తావించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై పవర్‌పాయింట్ ప్రజేంటేషన్

పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై పవర్‌పాయింట్ ప్రజేంటేషన్


పాదయాత్ర రూట్‌మ్యాప్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.పాదయాత్ర ఎలా ఉంటుంది. ఎలా సాగనుందనే విషయాలపై చర్చించారు.రూట్‌మ్యాప్‌పై స్థానిక నేతల సూచనలు సలహలు తీసుకొన్నారు.

నవంబర్ 4న,.తిరుపతికి జగన్

నవంబర్ 4న,.తిరుపతికి జగన్

నవంబర్4వ, తేదిన వైఎస్ జగన్ తిరుపతికి వెళ్ళనున్నారు. కాలినడకన శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకొన్న తర్వాత వైఎస్ జగన్ నేరుగా కడప జిల్లాకు చేరుకొంటారు. కడపలో దర్గాను, చర్చిల్లో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకొంటారు. ఇడుపులపాయనుండి నవంబర్ 6వ, తేది నుండిజగన్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.

రెండు మాసాల పాటు సీమ జిల్లాల్లోనే పాదయాత్ర

రెండు మాసాల పాటు సీమ జిల్లాల్లోనే పాదయాత్ర

నవంబర్ 8వ, తేదిన ప్రారంభమయ్యే పాదయాత్ర సుమారు రెండు మాసాల పాటు కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాదయాత్ర పూర్తైన తర్వాత మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్ బస్సుయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. పాదయాత్ర ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. బస్సు యాత్ర ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగించాలనే దానిపై ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకొన్నారు.

జిల్లా అధ్యక్ష పదవులు రద్దు చేసిన వైఎస్ జగన్

జిల్లా అధ్యక్ష పదవులు రద్దు చేసిన వైఎస్ జగన్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ జిల్లా అధ్యక్ష పదవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. జిల్లాల అధ్యక్ష పదవుల స్థానంలో పార్లమెంటరీ నియోజకవర్గానికి అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు ప్రతి రెండు జిల్లాలకు ఒక ఇంఛార్జీని నియమించనున్నారు. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఈ పద్దతి ఉపయోగపడుతోందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

పల్లె నిద్ర చేయాలని నేతలకు జగన్ సూచన

పల్లె నిద్ర చేయాలని నేతలకు జగన్ సూచన

పల్లె నిద్ర చేయాలని వైసీపీ నేత వైఎస్ జగన్ పార్టీ నేతలకు సూచించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. మరోవైపు ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామాల్లో పర్యటించాలని జగన్ సూచించారు.

English summary
ysrcp chier Ys Jagan will start Paadayatra on Nov 8, from Kadapa district.ysrcp key leaders meeting held at Hyderabad. Ysrcp chief Ys jagan will conduct Paadayaatra from Kadapa,then he will enter into Kurnool and Anantapuram districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X