YS Jagan : ఏపీలో 2023-24 సంక్షేమ క్యాలెండర్ విడుదల - ఎన్నికల ఏడాదిలో జగనన్న పథకాలివే...

ఏపీలో జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్‌ 2023-24ను సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ ఆవిష్కరించారు. వచ్చే ఏడాది కాలంలో అంటే ఎన్నికల ఏడాదిలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసే పథకాల జాబితాను తేదీలతో సహా విడుదల చేశారు. ఇందులో పలు పథకాల వివరాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకాలు ఈ ఏడాది కూడా విజయవంతంగా అమలుచేస్తే ఐదేళ్ల పాటు పథకాలు పక్కాగా అమలు చేసినట్లవుతుంది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ అంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో, ఇంకా చెప్పాలంటే ఎన్నికల ఏడాదిలో వైసీపీ సర్కార్ అమలు చేయబోయే సంక్షేమ పథకాలను క్యాలెండర్ రూపంలో సీఎం జగన్ విడుదల చేశారు. దీని ప్రకారం పథకాల వివరాలు ఇలా ఉన్నాయి.

ys jagan releases welfare schemes calendar for 2023-24-here are details

ఏప్రిల్‌ 2023 - జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మే 2023 - వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ (మొదటి విడత), వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, జగనన్న విద్యాదీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీ తోఫా (మొదటి త్రైమాసికం), వైఎస్సార్‌ మత్స్యకార భరోసా

జూన్‌ 2023 - జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ లా నేస్తం (మొదటి విడత), మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జులై 2023 - జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్‌ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్‌ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (రెండో త్రైమాసికం)

ఆగష్టు 2023 - జగనన్న విద్యా దీవెన (రెండో విడత), వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర

సెప్టెంబర్‌ 2023 - వైఎస్సార్‌ చేయూత

అక్టోబర్‌ 2023 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (రెండవ విడత), జగనన్న వసతి దీవెన (మొదటి విడత)

నవంబర్‌ 2023 - వైఎస్సార్‌ సున్నావడ్డీ - పంట రుణాలు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (మూడవ త్రైమాసికం), జగనన్న విద్యాదీవెన (మూడవ విడత)

డిసెంబర్‌ 2023 - జగనన్న విదేశీ విద్యాదీవెన (రెండవ విడత), జగనన్న చేదోడు, మిగిలిపోయిన లబ్ధిదారులకు లబ్ధి

జనవరి 2024 - వైఎస్సార్‌ రైతుభరోసా - పీఎం కిసాన్‌ (మూడవ విడత), వైఎస్సార్‌ ఆసరా, జగనన్న తోడు (రెండవ విడత), వైఎస్సార్‌ లా నేస్తం (రెండవ విడత), పెన్షన్ల పెంపు (నెలకు రూ. 3000)

ఫిబ్రవరి 2024 - జగనన్న విద్యా దీవెన (నాల్గవ విడత), వైఎస్సార్‌ కళ్యాణమస్తు-షాదీతోఫా (నాల్గవ త్రైమాసికం), వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

మార్చి 2024 - జగనన్న వసతి దీవెన (రెండవ విడత), ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+