ఆరోగ్య సురక్షపై కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు-డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు..
ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ రెండు ముఖ్యమైన కార్యక్రమాలమీద సమీక్షించారు. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనదని, వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందని జగన్ తెలిపారు. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు.
శిబిరాల్లో గుర్తించిన రోగులకు చేయూత నివ్వడం చాలా ముఖ్యమని కలెక్టర్లకు సీఎం జగన్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావన్నారు. శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అన్నది అత్యంత ముఖ్యమైనదని,కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంతవరకూ మనం చేదోడుగా నిలుస్తామన్నారు.

ముందుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించామని, ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యిందన్నారు. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారని తెలిపారు. అలాగే 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారన్నారు.

ఇప్పుడు జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నామని జగన్ తెలిపారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని కలెక్టర్లకు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై మన దగ్గర డేటా ఉందన్నారు.
జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలన్నారు. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.
ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుందన్నారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయన్నారు. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యతన్నారు.అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలన్నారు.

డిసెంబర్ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలన్నారు. దిశ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయన్నారు. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదన్నారు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుందన్నారు. లేకపోతే విలేజ్ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్ చేస్తారన్నారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానినీ అందిస్తారన్నారు.
అలాగే నవంబర్ 9 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలన్నారు. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలన్నారు. గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలని ఆదేశించారు. ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలన్నారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లో నాడు - నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలని, ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలని, పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో చెప్పాలన్నారు.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications