టిడిపికి షాక్: భూమా బ్రహ్మానంద రెడ్డి వింత లెక్కలు, విస్తుపోతున్న జనం!
నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయని వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక్షిలో వార్తలు వస్తున్నాయి.
నంద్యాల: నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయని వైసిపి అధినేత జగన్‌కు చెందిన సాక్షిలో వార్తలు వస్తున్నాయి.

భూమా ఖర్చు రూ.6.49 లక్షలేనా
ఎన్నికల్లో గెలిచేందుకు రూ.కోట్లు వెదజల్లిన టిడిపి తమ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఖర్చును కేవలం రూ.6.49 లక్షలే అని పేర్కొనడంపై జనాలు నివ్వెరపోతున్నారని పేర్కొంది.

సాక్షాలు ఉన్నాయని..
ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి డబ్బులు పారించిందని పేర్కొంది. వందల కోట్ల రూపాయలను టిడిపి నేతలు ఖర్చు పెట్టినట్లుగా ఆరోపించింది. ఇందుకు సంబంధించి సాక్షాలు కూడా చూపించామని పేర్కొంది.

ఆశ్చర్యానికి గురి చేస్తోందని..
ఉప ఎన్నికల్లో టిడిపి పార్టీ మద్యాన్ని ఏరులై పారించిందని పేర్కొంది. మద్యం ఖర్చు రూ. కోట్లలో ఉందని ఆరోపణలు గుప్పించింది. కానీ టిడిపి అభ్యర్థి ఖర్చును కేవలం రూ.6 లక్షల 49 వేలు మాత్రమే చూపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అభిప్రాయపడింది.

కాంగ్రెస్ అభ్యర్థి ఖర్చు కంటే..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే దాదాపు కేవలం రూ.20వేలు మాత్రమే ఎక్కువ ఖర్చును చూపించారని పేర్కొంది. నామినేషన్ రోజు పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు టిడిపి అభ్యర్థి ఖర్చు చాలా తక్కువ ఉండటాన్ని ప్రశ్నించింది. ముఖ్యమత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన ఖర్చే రూ.కోటి వరకు ఉంటుందని అభిప్రాయపడింది. ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పర్యటించారని గుర్తు చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications