అప్పుడే ప్రత్యేక హోదా- అప్పుల్లో బాబు కంటే బెటర్-అసెంబ్లీలో జగన్ కీలక వ్యాఖ్యలు..
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాల్ని ఏకరువు పెట్టారు. ప్రతీ రాష్ట్రానికీ ఓ పవర్ హౌస్ కావాలని, హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల చాలా నష్టపోయామని జగన్ తెలిపారు. అందుకే విశాఖపట్నంపై ఫోకస్ పెడుతున్నామన్నారు.రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తలసరి ఆదాయం తగ్గిపోయిందన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీకి ఆదాయం తక్కువన్నారు. ప్రతీ రాష్ట్రానికీ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ఓ మహానగరం ఉంటేనే ఆదాయం వస్తుందన్నారు.
హైదరాబాద్ లేకపోవడం వల్ల భారీగా ఆదాయం కోల్పోయామన్నారు. హైదరాబాద్ లేకపోవడం వల్ల పదేళ్లలో లక్షా 40 వేల కోట్లు కోల్పోయినట్లు జగన్ తెలిపారు. విభజన తర్వాత రాష్ట్రానికి కనీసం ప్రత్యేక హోదా ఉంటే ఊరటగా ఉండేదని జగన్ గుర్తుచేశారు. చట్టంలో ఉండి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించుకునే వాళ్లమన్నారు. మనకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం వస్తే తప్ప ప్రత్యేక హోదా వచ్చేలా లేదన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వారికి తగినన్ని సీట్లు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. అలా అయినా ప్రత్యేక హోదా ఇస్తారేమో అన్న ఆశ ఉందన్నారు.

2019 లేకుండా ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి అవినీతి లేకుండా ప్రజలకు చేరుతుందా అంటే నమ్మే పరిస్దితి లేదని సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి పంపుతున్నామన్నారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఖర్చుపెట్టిన మూలధన వ్యయంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వంలో ఖర్చుపెట్టింది చాలా ఎక్కువన్నారు. ఇందులో స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు అమలుతో పాటు పోర్టుల అభివృద్ధి కూడా ఉందన్నారు.
తమ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేసిందని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు.కానీ విభజన నాటికి రాష్ట్రం నేరుగా చేసిన అప్పు గ్యారంటీలతో అన్నీ కలిపి రూ.1.52 లక్షల కోట్లని, ఇది చంద్రబాబు దిగిపోయే సమయానికి 4.12 లక్షల కోట్లకు చేర్చారని, వైసీపీ ప్రభుత్వంలో అది 7.12 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇందులో అప్పుల వృద్ధిరేటు చూస్తే చంద్రబాబు హయాంలో ఏడాదికి 21.87 శాతం పెరుగుదల ఉందని, వైసీపీ ప్రభుత్వంలో అది 12.31 శాతం మాత్రమేనన్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications