జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (ys jagan) మీడియా వ్యవహారాలు చూస్తున్న సీపీఆర్వో, పార్టీ ప్రధాన కారదర్శిగా కూడా ఉన్న పూడి శ్రీహరి (pudi Srihari)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. నిన్న రాత్రి నుంచి తాడేపల్లిలోని జగన్ నివాసానికి సమీపంలో ఉన్న ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన మఫ్టీ పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం జగన్ ను కలిసి ఇంటికి వెళ్తున్న శ్రీహరిని మధ్యలోనే అడ్డగించి తమతో పాటు తీసుకెళ్లారు. ఏ కేసులో ఆయన్ను అరెస్టు చేస్తున్నారో కూడా వెల్లడించలేదు. శ్రీహరి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకోవడమే కాక ఆయన ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.

పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ మండిపడింది. సీనియర్ జర్నలిస్ట్ అయిన జగన్ సీపీఆర్వో పూడి శ్రీహరిని ఇలా ఉగ్రవాదిలా ఆరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మాజీ మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలో రాజ్యంగం అమలు చేస్తున్నారా? అని కన్నబాబు ప్రశ్నించారు. ఒక ప్రైవేటు గ్యాంగ్ ఎత్తుకెళ్ళినట్లుగా పూడి శ్రీహరిని పోలీసులు తీసుకువెళ్ళారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్దంగా మఫ్టీలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని,నిజంగా అరెస్ట్ చేస్తే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా శ్రీహరి పేరు లేదన్నారు. శ్రీహరి అరెస్ట్ చంద్రబాబు కార్యక్రమమా? లేక లోకేష్,హోం మంత్రి కార్యక్రమమా అని అడిగారు.

YS Jagan s CPRO Pudi Srihari Arrested in Social Media Case YSRCP Approaches High Court and DGP

ఏం నేరం చేశార‌ని శ్రీహ‌రిని అరెస్ట్ చేయించారో చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఒక విలేక‌రిగా ఎదిగి పైకొచ్చిన వ్య‌క్తి పూడి శ్రీహ‌రి అని, మీరు చేసేది చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన చ‌ర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి అరెస్టు చేయాలని సూచించారు. శ్రీహ‌రి ఏమైనా మ‌ర్డ‌ర్లు చేశాడా , నేరాలు చేశాడా, ఎవ‌రిని భ‌యపెట్ట‌డానికి మీరు ఇలాంటి త‌ప్పుడు చ‌ర్య‌లు చేస్తున్నారు చంద్ర‌బాబు అని ప్రశ్నించారు. సోష‌ల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళ‌తారా అని అడిగారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు నారా లోకేష్ ఆఫీస్ నుంచి , బాల‌కృష్ణ‌ ఇంటి ఐపీ అడ్ర‌స్ నుంచి నీచ‌మైన పోస్టులు పెట్టించారని, అప్పుడు మిమ్మ‌ల్ని ,మీ ప‌క్క‌న ఉన్న‌వారంద‌రినీ ఇలాగా ఎత్తుకుపోయారా అని ప్రశ్నించారు. మరోవైపు శ్రీహరి ఆచూకీ తెలియకపోవడంతో వైఎస్సార్సీపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.

YS Jagan s CPRO Pudi Srihari Arrested in Social Media Case YSRCP Approaches High Court and DGP

రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి, జగన్‌ సీఎంగా ఉన్నప్పటి నుంచి సీపీఆర్వోగా పని చేస్తున్న పూడి శ్రీహరిని అంత దారుణంగా నిర్భంధించి తీసుకుపోవడం కచ్చితంగా చట్ట ఉల్లంఘన అని డీజీపీకి రాసిన లేఖలో వైసీపీ పేర్కొంది. పోలీస్‌ శాఖకు రాష్ట్రంలో ఉన్నతాధికారిగా మీకు ఆ విషయం తెలుసని తెలిపింది. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండా, ఇష్టానుసారం అరెస్టు చేయడం సరికాదని గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పిందని, ఆ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసిందని తెలిపింది. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ, పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, ఆ చేసిన విధానం అమానుషం, ఆటవికం, అత్యంత దౌర్జన్యకరం, ఇది కచ్చితంగా మానవ హక్కుల యథేచ్ఛ ఉల్లంఘనే అని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+