పులి బిడ్డను, ఆ దమ్ము నాకుంది - షర్మిల..!!

పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. వైఎస్ హయాంలో జరిగిన కార్యక్రమాలు..జగన్ పాలనలో వైఫల్యాలను వివరిస్తున్నారు. తాను పులి బిడ్డనని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్‌కు జగన్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలను ఒక్కటి అమలు చేశారా అని నిలదీసారు. అవినాశ్ ను అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరని షర్మిల ప్రశ్నించారు.

షర్మిల ప్రచారం
కడప జిల్లాలో షర్మిల ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండగని గుర్తు చేసారు. నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు లేడని చెప్పుకొచ్చారు. పంట నష్ట పరిహారం అని మోసం చేశాడని మండిపడ్డారు. ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేసారన్నారు.

YS Sharmila Express confidence over her winning in Kadapa Loksabha against Avinsah Reddy

ఎవరి వైపు ఉంటాయా
నిరుద్యోగ బిడ్డలను వంచనకు గురిచేశారని ఆరోపించారు. 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి, అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని వివరించారు. తాను వైఎస్ఆర్ బిడ్డ.. పులి బిడ్డగా చెప్పుకున్నారు. తన గుండెలో దమ్ముందన్నారు. న్యాయం కోసం ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. మళ్ళీ నిందితుడికి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయమన్నారు. న్యాయం వైపు ఉంటారా.. అన్యాయం వైపు ఉంటారో కడప గడ్డ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.

కడప గడ్డ పైనే ఉంటాను
తాను పుట్టింది ఇక్కడేనని...ఇది తన గడ్డగా షర్మిల చెప్పుకొచ్చారు. ఇక్కడే ఉంట.. ప్రజా సేవ చేస్తానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కడప ఎంపీగా అనాడు వైఎస్ఆర్ పని చేశారని... వైఎస్ వివేకా కూడా ఎంపీగా గెలిచారన్నారు. వైఎస్ వివేకాను హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి అని షర్మిల ఆరోపించారు. హత్య జరిగిన సమయంలో తమకు ఈ విషయం తెలియదన్నారు. సీబీఐ ఆధారాలు చూపించిన తర్వాత నమ్మాల్సి వచ్చిందన్నారు. అన్ని ఆధారాలు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని చెబుతున్నాయని వివరించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ సృష్టించారని వ్యాఖ్యానించారు. సీబీఐకి సహకరించకుండా అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా చూశారని షర్మిల చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+