కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల, వైఎస్సార్టీపీ విలీనం-తండ్రి వైఎస్సార్ కల నెరవేర్చేందుకే..

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవాళ చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్, ఖర్గేసహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల కాంగ్రెస్ లో తాను చేరడంపై స్పందించారు.

Recommended Video

    Congress లో చేరిన Ys Sharmila.. YSRTP విలీనం | YSRTP Congress Merger | Telugu Oneindia

    వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

    ys sharmila joined congress, merged ysrtp in it, says for fulfilling later father ysrs dream

    దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సేనని, అన్ని వర్గాలను కలుపుకుంటూ, అన్ని వర్గాలను కలుపుతూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్సార్ కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

    ys sharmila joined congress, merged ysrtp in it, says for fulfilling later father ysrs dream

    ఓ క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందని వైఎస్ షర్మిల తెలిపారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని షర్మిల తెలిపారు. మరోవైపు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి తెలంగాణలో పోటీ చేయలేదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+