సింహాన్ని చంపేది సింహమే -వివేకా కేసులో సునీల్ అరెస్టుపై సోదరుడు కిరణ్ షాకింగ్ కామెంట్స్

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరిన్ని సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ విషయంలో పలు చర్చలు సాగుతుండగావే.. తాజాగా ఆయన సోదరుడు కిరణ్ యాదవ్... సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్య కేసులో ఆధారాల కోసం నిన్న సీబీఐ అధికారులు.. నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేశారు. పలు బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆయన సోదరుడు కిరణ్ యాదవ్ మండిపడ్డారు. తాము చాలా సాధారణ వ్యక్తులమని, వివేకాను హత్య చేసేటంత వ్యక్తులం కాదని అన్నాడు. సోదాల పేరుతో సీబీఐ అధికారులు తమ ఇల్లంతా చిందరవందర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ys vivekananda reddy murder case : accused suneels brother kiran shocking comments on cbi

సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ బ్యాంకు బుక్కులు, ఓ పాత చొక్క తీసుకెళ్లారని కిరణ్ తెలిపారు. తాము తాము సిబిఐ వేధింపులు తట్టుకోలేకే రిట్ పిటిషన్ వేశామని, కానీ మేము రీట్ పిటిషన్ వేసినందుకు కక్ష సాధింపు కోసం వేధిస్తున్నట్లున్నారని కిరణ్ ఆరోపించాడు. వివేకానందరెడ్డిని ఎవరు చంపిందీ అందరికి తెలుసని కిరణ్ తెలిపాడు. తాము గోవాలో ఉంటే ఫోన్ ఐడితో పట్టుకున్న వాళ్లు... రెండేళ్లైనా వివేకా హత్య కేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని సీబీఐని కిరణ్ యాదవ్ ప్రశ్నించారు.

Recommended Video

    Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

    అమాయకులమనేనా, మమ్ముల్ని ఇబ్బంది పెడుతున్నారని సీబీఐ అధికారుల్ని కిరణ్ యాదవ్ ప్రశ్నించారు. సింహాన్ని సింహమే చంపుతుంది కానీ.......చిట్టెలుకలు చంపలేవంటూ నర్మగర్భంగా వైఎస్ కుటుంబ పాత్రపై కిరణ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తామెలాంటి తప్పూ చేయలేదన్నారు. అయినా సీబీఐ అధికారులు కక్షగట్టి తమను వేధిస్తున్నారని కిరణ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేసిన తన సోదరుడు సునీల్ యాదవ్ కూ ఈ హత్యకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. వివేకా హత్య కేసులో పెద్ద చేపల్ని తప్పించేందుకే సీబీఐ తమను టార్గెట్ చేస్తోందని ఇప్పటికే సునీల్ యాదవ్ కుటుంబం ఆరోపించింది. ఇప్పుడు కిరణ్ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+