సీఎం జగన్ సీరియస్ డెసిషన్స్ - వైఎస్‌ కొండారెడ్డి జిల్లా బహిష్కరణ : ఉపేక్షించేది లేదు..!!

శాంతి భద్రతల విషయంలో సీఎం జగన్ మరింత కఠినంగా వ్యవహిరించాలని నిర్ణయించారు. తొలి నుంచి లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకు స్వేచ్చ ఇచ్చిన సీఎం..ఇప్పుడు తన సొంత పార్టీ వారైనా తప్పు చేస్తే ఉపేక్షించవద్దని తేల్చి చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా చక్రాయపేట మండలం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న వైఎస్‌ కొండారెడ్డి పైన సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందురు చర్యలు చేపట్టారు. దీంతో..కొండారెడ్డి బహిష్కరణపై ఎస్పీ అన్బురాజన్ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.

సీఎం జగన్ సీరియస్..ఆదేశాలు

సీఎం జగన్ సీరియస్..ఆదేశాలు

ఎస్‌ఆర్‌కే కన్​స్ట్రక్షన్స్ గుత్తేదారును బెదిరించిన కేసులో కొండారెడ్డిని పోలీసులు సీఎం జగన్ ఆదేశాలతో అరెస్టు చేశారు. అయితే.. కొండారెడ్డి ఇవాళ బెయిల్​పై విడుదలయ్యారు. జైలునుంచి విడుదలైన కొండారెడ్డిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. కొండారెడ్డి పులివెందుల-రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను అడ్డుకున్నారు. దీంతో గుత్తేదారులు చక్రాయపేటలో కొండారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అక్కడి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

జిల్లా బహిష్కరణకు నిర్ణయం

జిల్లా బహిష్కరణకు నిర్ణయం

జిల్లాలో ఎవరైనా బెదిరింపులకు, అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

ఈ వ్యవహారం ద్వారా లా అండ్ ఆర్డర్ విషయంలో తాను ఎంత కఠినంగా వ్యవహరించేదీ సీఎం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలోనూ శాంతి భద్రతలు... మహిళా సంరక్షణ విషయంలో ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కఠినంగానే ఉండాలని మంత్రులకు సైతం సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.

మరిన్ని కీలక నిర్ణయాల దిశగా

మరిన్ని కీలక నిర్ణయాల దిశగా

పదో తరగతి ప్రశ్నా పత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలోనూ ఎంతటి వారు తప్పు చేసినా ఉపేక్షించవద్దని సీఎం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక, ఇందులో ప్రమేయం ఉందని తేలిన వారి విషయంలోనూ చర్యలు తప్పవని తెలుస్తోంది. మహిళల పైన చోటు చేసుకుంటున్న ఘటనల్లో బాధ్యులను శిక్షించేందుకు తీసుకొచ్చిన దిశ చట్టం ఆమోదం దిశగా కొన్ని సవరణలను సైతం నేటి కేబినెట్ లో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+