ఆ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే..!!

Sajjala Ramakrishna Reddy: జూన్ 4వ తేదీన మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా తాము అధికారంలో రాబోతోన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌ సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండో రోజు కూడా కౌంటింగ్‌ ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

YSRCP all set host celebrations across the State on June 4 says Sajjala Ramakrishna Reddy

పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుపై దేశమంతా ఒక నిబంధన.. ఏపీలో మరో నిబంధన ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు సంతకం ఉంటే చాలనే నిబంధనలు పెట్టారని, ఇది సరికాదని చెప్పారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తోన్నారనడానికి ఇదొక నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున అక్రమాలు, కుట్రలకు పాల్పడొచ్చని, అందుకే కౌంటింగ్‌ సమయంలో అప్రమత్తంగా ఉండాలని పునరుద్ఘాటించారు. కౌంటింగ్‌ పూర్తయినప్పటికీ.. డిక్లరేషన్‌ అయ్యేంత వరకు ఎవరూ బయటకి రావొద్దని అన్నారు.

జాతీయ స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ తప్పేనని, చంద్రబాబుకి బీజేపీతో పొత్తు లేకుంటే అలాంటి ఫలితాలు ఇచ్చేవారు కాదని పేర్కొన్నారు. తప్పుడు సర్వేలు చూసుకుని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సంబరాలు తాత్కాలికమేనని, అసలు సంబరాలు రేపు మేం చేస్తామని సజ్జల అన్నారు.

కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకునప్పటి నుంచి ఈసీ ద్వారా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని సజ్జల విమర్శించారు. ఎవరెన్ని పాచికలు విసిరినా తమ ముందు అవి పని చేయవని, భారీ మెజారిటీతో గెలుస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ ఒక్క రోజు వరకేనని చురకలు అంటించారు.

చంద్రబాబుకు అసలు పిక్చర్ తెలుసు కనుక గుంభనంగా ఉంటోన్నాడని, లోకేష్ అయితే అసలు అడ్రెస్స్ లేడని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ- ఎన్నికల కమిషన్‌ చేసింది తప్పేననే విషయం అందరికీ తెలుసునని సజ్జల ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+