డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!!

ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య సాగుతున్న రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. మహిళా రిజర్వేషన్లు.. డీ లిమిటేషన్ పైన కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కూటమి డీలిమిటేషన్ తీరను వ్యతిరే కిస్తోంది. ఇతర పార్టీల మద్దతు కూడగడుతోంది. స్టాలిన్ వంట నేతలు కేంద్రానికి హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ఈ సమయంలో మాజీ సీఎం జగన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.

రేపు (బుధవారం) కేంద్రం పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పైన చర్చ చేపట్టనుంది. ఈ బిల్లుతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ.. అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచుతూ చట్ట సవరణ కు మరో బిల్లును ప్రతిపాదించనుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ ను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ కూటమి ఈ డీలిమిటేషన్ తీరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాదిస్తోంది. దీంతో.. ఎన్డీఏ కు వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటు బీఆర్ఎస్, సమాజ్ వాదీ సైతం డీలిమేటేషన్ తీరును వ్యతిరేకిస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీ కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం పైన తమ వైఖరి స్పష్టం చేసింది. ఇప్పటికే పార్టీ ఎంపీలతో జగన్ ఈ అంశాల పైన చర్చించారు.

జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!!
జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!!
ysrcp-announces-support-for-modis-govt-move-for-delimitation-as-2011-census-womens-reservation

మారుతున్న రాజకీయ లెక్కలు

కేంద్రం ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లు, డీ లిమిటేషన్ కు మద్దతు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసు కొన్నారు. పార్టీ ముఖ్య నేత సజ్జల ఈ విషయాన్ని ప్రకటించారు. డీలిమిటేషన్‌పై తమ ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. అదే సమయంలో కొంత మంది లేవనెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని సజ్జల రామ‌కృష్ణారెడ్డి కోరారు. నియోజక వర్గాల పునర్విభజన నిర్ణయాన్ని జగన్ ఇప్పటికే స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు గతంలోనే వైసీపీ మద్దతు ప్రకటంచింది. ఇటు టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్డీఏ లో కొనసాగుతున్నాయి. ఆ కూటమి ఏపీలో జగన్ ను ఓడించి అధికారంలోకి వచ్చింది. అయితే, కొద్ది రోజుల క్రితం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలోనూ జగన్ మద్దతు ఇచ్చారు. 2019-24 మధ్య కాలంలోనూ ఎన్డీఏలో లేకపోయినా మద్దతుగా నిలిచారు. ఇక.. ఇప్పుడు సైతం జగన్ కేంద్రంతో అదే సఖ్యత కొనసాగించే క్రమంలో మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో.. జగన్ తీసుకుంటు న్న ఈ నిర్ణయాలు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు కారణం అవుతాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+