నామినేషన్లు వేసి ఎన్నికల్ని బహిష్కరించిన వైసీపీ-పెద్దిరెడ్డి రీజన్ ఇదే..!

ఏపీలో కీలకమైన ప్రజా పద్దుల కమిటీ సభ్యుల ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఇవాళ జరగాల్సిన ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేయడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం తీరు వల్లే తాము పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు.

ysrcp boycotts public accounts committee elections here is peddireddy Ramachandra reddy s reason

పీఏసీ ఎన్నికల కోసం నిన్న వైసీపీ మొత్తం మూడు నామినేషన్లు దాఖలు చేసింది. ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ ఉన్నారు. అధికార కూటమి 9 నామినేషన్లు దాఖలు చేసింది. దీంతో పీఏసీలో మొత్తం 12 మంది సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందులో 9 మంది ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే కూటమి నుంచి 9 నామినేషన్లు దాఖలు కావడంతో ప్రస్తుత సభలో సంఖ్యాబలం మేరకు వారంతా ఎన్నిక కావడం ఖాయమే. అయితే వైసీపీ నుంచి దాఖలైన మూడు నామినేషన్లలో ఒక అభ్యర్ధి మాత్రం గెలిచే అవకాశముంది. ఈ తరుణంలో వైసీపీ పీఏసీ ఎన్నికల్ని బహిష్కరించింది.

గతంలో అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉన్న సంప్రదాయాల ప్రకారం విపక్ష సభ్యులకు పీఏసీ ఛైర్మన్ పగ్గాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం విపక్షానికి సంఖ్యా బలం లేదన్న సాకు చూపి పీఏసీకి ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్ని తాము బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ తప్పిదాల్ని ప్రశ్నించే పీఏసీ పదవిని విపక్షాలకు ఇస్తారని, కేవలం ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్లు తప్ప ఎవరూ ఇలా చేయరని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+