పత్తికొండను వైసీపీ నిలబెట్టుకుంటుందా ? బీసీలు మళ్లీ టీడీపీని ఆదరిస్తారా?

కర్నూలు లోక్ సభ సీటు పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పత్తికొండ. ఇందులో పత్తికొండ, మద్దికెర, కృష్ణగిరి, వెల్దుర్తి, తుగ్గలి మండలాలు వస్తాయి. ఓటర్లు 2 లక్షల పైమాటే. జనాభా పరంగా చూస్తే బీసీలు ఎక్కువ. రాజకీయంగా మాత్రం రెడ్లదే ఆధిపత్యం. బీసీల్లో ఈడిగలకు, రెడ్లకూ మధ్య రాజకీయంగా పోరు సాగుతుంటుంది. ఇక్కడ మొత్తం 16 ఎన్నికలు జరిగితే 9 సార్లు రెడ్లే గెలిచారంటే పరిస్దితి అర్ధం చేసుకోవచ్చు. మిగతా ఎన్నికల్లో బీసీల హవా సాగుతోంది.

టీడీపీ ఆవిర్భావానికి ముందు పత్తికొండ అసెంబ్లీ సీటులో ఆరుసార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు కాంగ్రెస్ (1955, 1962, 1972, 1978) గెలిచింది. ఓసారి ఇండిపెండెంట్(1957), మరోసారి సీపీఎం (1967) గెలిచాయి. టీడీపీ పుట్టాక ఇక్కడ ఓ ఉప ఎన్నికతో పాటు 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కేవలం రెండుసార్లే (1983, 1989) గెలిచింది. వైసీపీ 2019లో మాత్రమే గెలిచింది. మిగిలిన ఏడుసార్లు టీడీపీనే గెలిచింది. ఇందులోనూ మూడుసార్లు ఎస్వీ సుబ్బారెడ్డి, రెండుసార్లు కేఈ కుటుంబం గెలిచాయి.

ysrcp facing tough challenge in bc populated pattikonda assembly seat amid tdp-janasena-bjp tie-up

గత మూడు ఎన్నికలు గమనిస్తే.. 2009లో టీడీపీ అభ్యర్ధి కేఈ ప్రభాకర్ దాదాపు 10 వేల మెజార్టీతో గెలిచారు. 2014లోనూ టీడీపీ అభ్యర్ధి కేఈ కృష్ణమూర్తి 7,800 మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ తొలిసారి ఇక్కడ గెలిచింది. వైసీపీ అభ్యర్ధి కంగాటి శ్రీదేవి 43 వేల భారీ మెజార్టీతో గెలిచారు. బీసీల మద్దతుంటే టీడీపీకి పత్తికొండలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసారి జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి వైసీపీ ఈ సీటు నిలబెట్టుకోవాలంటే శ్రమించక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+